ప్రస్తుత దివాలా ప్రక్రియను, దాని ప్రభావాన్ని ఘన విజయంగా అభివర్ణించింది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్స్రీ కోడ్ (ఐబీసీ) రాకతో బ్యాంకింగ్ రంగంలో పేరుకుపోయిన మొండి బకాయిల్లో రూ.2.8 లక్షల కోట్లు వసూలైనట్లు సదరు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు చెబుతున్నారు. దేశీయ బ్యాంకింగ్ రంగ మొండి బకాయిలు రూ.10 లక్షల కోట్లపైనే ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకు ల వాటానే దాదాపు రూ.8 లక్షల కోట్లు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారమే. అనధికారిక లెక్కలు, ఇప్పటిదాకా ఉన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం మరింత పెరుగుతుంది. దివాలా చట్టం ద్వారా 100 కేసులు పరిష్కారమయ్యాయి. భూషణ్ స్టీల్ అండ్ పవర్, ఎస్సార్ స్టీల్ వంటి భారీ కార్పొరేట్ సంస్థల వాటానే రూ.1.8 లక్షల కోట్లు. మరో లక్ష కోట్ల రూపాయలు ఇతర మధ్య, చిన్న శ్రేణి సంస్థలకు చెందిన కేసుల ద్వారా వచ్చాయి. మొత్తం రూ.2.8 ల క్షల కోట్లు వసూలయ్యాయి.
దివాలా చట్టంతో భారీగా వసూళ్లు
ఇదేమీ చిన్న మొ త్తం కాదు. కాబట్టి ఐబీసీ సత్ఫలితాలనిచ్చిన ట్లే అని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శా ఖలోని సీనియర్ అధికారులు విశ్లేషిస్తున్నారు.నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) వద్ద మరో 6,500 కేసులు పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతున్నది. వీటి విలువ రూ.3 లక్షల కోట్లుగా ఉన్నది. మరో 100 కేసులకూ 90 శాతం రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదం లభించింది. కోర్టుకు వెలుపల జరిగిన సెటిల్మెంట్లివి. ఇంకో 500 కేసులు కోర్టుల్లో పరిష్కారమయ్యాయని అధికారులు చెబుతున్నారు. కాగా, ఎస్సార్ స్టీల్ రుణదాతలు పరిష్కార ప్రక్రియకు ఆమోదం తెలిపినప్పటికీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ తమకు ఎక్కువ మొత్తం రావాలంటూ ఎన్‌సీఎల్‌ఏటీ ను ఆశ్రయించింది. దీంతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. అయితే దివాలా కేసు పరిష్కారంలో భాగంగా గ్లోబల్ ఉక్కు తయారీ దిగ్గజం ఆర్సెలార్‌మిట్టల్ నుంచి రూ.42,000 కో ట్లు ఎస్సార్ స్టీల్‌కు వచ్చిన విషయం తెలిసిం దే. ఇక భూషణ్ స్టీల్ అండ్ పవర్ కోసం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తొలుత ఇచ్చిన రూ.11,000 కోట్ల ఆఫర్‌ను రూ.18,000 కోట్లకు మా ర్చింది. ఆ తర్వాత రూ.19,000 కోట్లుకుపైగా ఇస్తామని ముందుకొచ్చింది. దీనికి రుణదాతల కమిటీ అంగీకరించింది.దివాలా పరిష్కార ప్రక్రియలో రుణదాతలకు నష్టం వాటిల్లుతున్నదని, ఇచ్చిన రుణం విలువలో భారీగా కోతలు పడుతున్నాయన్న విమర్శల్ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. వాస్తవ విలువ కంటే ఎవరు మాత్రం ఎక్కువిస్తారని ప్రశ్నించింది. 20 ఏండ్లు వాడుకున్న ఓ ఆస్తిపై రూ.50,000 కో ట్ల అప్పుంటే.. అంత రాదని, ప్రభుత్వ లెక్కల ప్రకారం దాని మార్కెట్ విలువ వెయ్యి కోట్ల రూపాయలుగా ఉంటే అంతే వస్తుందని స్ప ష్టం చేసింది. డిమాండ్, సైప్లెలు విలువను నిర్ధారిస్తాయన్నది. ఏదిఏమైనా రుణదాతలకు రిజల్యూషన్ ప్రక్రియలో 200 శాతం మార్కెట్ విలువ దక్కుతున్నదని చెప్పింది. ఇదంతా కూడా ఐబీసీవల్లేనని కొనియాడింది. ఐబీసీ నేపథ్యంలో బ్యాంకుల మొండి బకాయిల చి ట్టా కూడా తగ్గుతున్న సంగతి విదితమే. గ తంలో నష్టాలను ప్రకటించిన చాలా బ్యాంకులు ప్రస్తుతం లాభాలను ప్రకటిస్తునది చూస్తూనే ఉన్నాం. దీన్ని బ్యాంకర్లూ ధ్రువీకరిస్తున్నారు
No comments:
Post a Comment