Breaking News

17/05/2019

వేసవి రుతుపవనాల సరళిపై అధ్యయనం

హైద్రాబాద్, మే 17, (way2newstv.in)
మానవ కారక వాతావరణ కాలుష్యం కారణంగానే గత 448 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా, గత 80 ఏండ్లుగా వర్షపాతంలో తగ్గుదల నమోదవుతున్నట్టు తెలిపింది. వృక్షాల కాండంలోని వలయాల (ట్రీ రింగ్స్) ఆధారంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా పరిశోధకులు 1566 నుంచి ఆసియా వేసవి రుతుపవనాల సరళిపై అధ్యయనం చేశారు. దక్షిణ మధ్య చైనా నుంచి వీటిని సేకరించారు. 1940ల నుంచి రుతుపవనాలు బలహీనపడుతున్నట్టు, ఫలితంగా కరువు పరిస్థితులు ఏర్పడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. మరోవైపు ఈ ఎనిమిది దశాబ్దాల కాలంలో చైనాలో పారిశ్రామిక వృద్ధి, ఏరోసోల్ ఉద్గారాలు పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు. 


వేసవి రుతుపవనాల సరళిపై అధ్యయనం

సుమారు 450 ఏండ్లకు సంబంధించిన ట్రీ రింగ్స్ డేటాను సేకరించినట్టు ఆరిజోనా వర్సిటీకి చెందిన స్టీవ్ లీవిట్ తెలిపారు. ట్రీ రింగ్స్ పెరుగుదల వర్షపాతంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రపంచంలో దాదాపు సగం జనాభా ఆసియా వేసవి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుందని ఆయన వెల్లడించారు. గత కొన్ని దశాబ్దాలుగా వేసవి వర్షపాతం తగ్గుతున్నదని, ఫలితంగా భారత్ నుంచి సైబీరియా వరకు నీటి లభ్యత, వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడుతున్నదని పేర్కొన్నారు. వానలు సమృద్ధిగా పడిన సంవత్సరాల్లో ట్రీ రింగ్స్ దళసరిగా ఉంటాయి. వర్షాభావ పరిస్థితులున్న సంవత్సరాల్లో అవి పలుచగా ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో ఏడాది పెరుగుదలను తెలియజేస్తుంది. 1928, 29లో సంభవించిన కరువు పరిస్థితులు కూడా ట్రీ రింగ్స్ ద్వారా వెల్లడైనట్టు పరిశోధకులు తెలిపారు. నాటి కరువు కారణంగా ఒక్క చైనాలోనే ఐదు లక్షల మంది మరణించారు. 450 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా గత 80 ఏండ్లుగా వర్షపాతం తగ్గుదల నమోదవుతున్నదని అధ్యయనం తెలిపింది. 

No comments:

Post a Comment