Breaking News

01/05/2019

నీరు కారిపోతున్న డిజిటల్ విద్య

అదిలాబాద్, మే 1, (way2newstv.in)
విద్యార్థులను కంప్యూటర్ విద్యకు చేరువగా ఉంచనున్న లక్ష్యానికి విద్యాశాఖాధికారులు తూట్లు పొడుస్తున్నారు. తరగతి గదిలో కంప్యూటర్‌లు ఉన్నా బోదకులకు ఉపయోగపడకపోవడంతో విద్యార్థులు అంత కంప్యూటర్‌ల విద్యకు దూరం అవుతున్నారు. కొన్ని ఏళ్ళుగా ఈ సమస్య ఉన్నా అధికారులు స్పందిచకపోవడంతో విద్యార్దులు ప్రైవేటు కంప్యూటర్ శిక్షణ కేంద్రాలకు వెళ్ళాల్సి పరిస్దితి ఉంది. సమాజంలో దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు... ఈ గురుకులాలే దేవాలయాలు అన్నంతవిధంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. అప్పుడే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్షలకు,ఆలోచనా విధానాలకు అనుగుణంగా కేజీ టు పీజీ విద్యా పథకంతో పాటు మనమంతా కలలుగంటున్న బంగారు తెలంగాణ సాకారమవుతుంది.


నీరు కారిపోతున్న డిజిటల్ విద్య 

పేద, దళిత విద్యార్థులకు ఉచితం గా నాణ్యమైన విద్యను అందించాల న్న మంచి ఉద్దేశంతో యస్.ఆర్.శంకరన్ సలహాలు, సూచనలతో 1984లో సాంఘిక సంక్షేమ గురుకులాలు స్థాపించడం జరిగింది. మొదట్లో జిల్లా కు బాలురు, బాలికలకు వేర్వేరుగా ఒక్కొక్కటి చొప్పున ప్రారంభమైన ఈ గురుకుల పాఠశాలలు అప్పటి నుంచి ఇప్పటివరకు దినదినాభివృద్ధి చెందు తూ ఇంతింతై.. వటుడింతై అన్నట్లు నేడు కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకే సవాల్‌గా మారాయి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలల సంఖ్య139. అయితే ఇప్పటివరకు గురుకులాలంటే జనరల్ రెసిడెన్షియల్ పాఠశాలలుగానే పేరున్న పరిస్థితుల నుంచి  గురుకులాలంటే సంక్షేమ గురుకులాలుగా చెప్పుకునే స్థాయికి రావడం మనందరికి గర్వకారణం. చదువుకునే పరిస్థితి నుంచి చదువుకొనే పరిస్థితులున్న ఈ రోజుల్లో అటు విద్యార్థు లు ఇటు తల్లిదం డ్రులు సంక్షేమ గురుకుల పాఠశాలల పట్ల ఆకర్షితులవుతుండటం ఒక మంచి శుభ పరిణామం.మండలకేంద్రంతో పాటు వివిధ గ్రామాలపాఠశాల లోని కంప్యూటర్ విద్య నీరు గారిపోతుంది. కంప్యూటర్ విద్య వారికి అందిస్తామన్నా ఉద్దేశ్యంతో 2009లో ఎక్‌మ్ అనే సంస్ద కంప్యూటర్ ఆపరేటర్‌ను ఉచితంగా అందజేయడం కాకుండా వారే ఒక్క బోధనకు నియమించి ఆయన ద్వారా విద్యార్దులకు ప్రతిరోజు కంప్యూటర్ నిర్మించారు.అయితే ఈ సంస్ద టీచర్లను కొనసాగించడం విరమించారు. దీంతో అప్పటి నుండి విద్యార్దులకు కంప్యూటర్ విద్యకు దూరమైయింది. ఏక్‌మ్ సంస్ద అందజేసిన కంప్యూటర్‌లు నాలుగు ఏళ్ళుగామూలన ఉన్న విద్యశాఖాధికా రులుస్పందించకపో వడం దారుణం. కంప్యూటర్ బోధకులను నియమించి విద్యార్థులకు  కంప్యూటర్ విద్యను అందించాలని అటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ల్యాబ్‌లు వృథాగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి విద్యార్దులకు కంప్యూటర్ విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

No comments:

Post a Comment