Breaking News

01/05/2019

మో‘డల్ ‘గా నిజామాబాద్ స్టేషన్

నిజామాబాద్,  మే 1, (way2newstv.in)
నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిస్థితి రోజు రోజుకు దయనీయం గా మారుతుంది. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిజా మాబాద్ రైల్వేస్టేషన్‌ను మోడల్ రైల్వేస్టేషన్‌గా మారుస్తామని ప్రకటించారు. కాని ఇంత వరకు ఈ పనితనం ఎక్కడ కనిపిం చడం లేదు. దానికి తోడు మరిన్ని సమస్యలు పెరిగి ప్రయాణి కులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పేరుకే బ్రాడ్‌గేజ్ కాని అభివృద్ధిలో మాత్రం న్యారోగేజ్‌ను తలపిస్తుంది. రోజు రోజుకు అభివృద్ధి చెందాల్సిన స్టేషన్ సమస్యలతో సతమతమ వుతుంది. ఇదిలా ఉంటే నేతలు పట్టించుకున్న పాపాన పోవ డం లేదు.1905లో నిజాం పాలనలో ఏర్పడిన రైల్వే స్టేషన్‌కు బ్రాడ్‌గేజ్ ఏర్పడే వరకు ప్రత్యేకంగా నిలిచింది. బ్రాడ్ గేజ్ అయ్యాకనే అసలు సమస్య మొదలైంది. నిజామా బాద్ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేకంగా వంద మందికి పైగా రన్నింగ్ స్టాప్ ఉండటంతో పాటు ఇక్కడే యాక్సిడెంట్ రిలీఫ్ టీమ్, ట్రాయిన్ వాషింగ్ అండ్ క్లీనింగ్ సిస్టమ్, టోక్‌మోటివ్ మెయిం టెనెన్స్ షేడ్, రైలు ఇంజన్ మెకానికల్ స్టాఫ్ ఉండే వారు. వీరితో పాటు రైల్వే స్టేషన్‌లో వివిధ విభాగాల్లో పని చేసే సిబ్బందిని కాంట్రాక్ట్ పద్దతిపై పని చేసే వారు. 


మో‘డల్ ‘గా నిజామాబాద్ స్టేషన్

మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌గా మారిన సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లు ఉంది.  కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్‌ఎస్, ప్రతి పక్షంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికి వారే నిజామాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారు. కాని ఏ ఒక్క నేత కూడా ఇప్పటి వరకు స్టేషన్‌ను సందర్శించిన పాపాన లేకపోవడం గమనార్హం.కాని ఇప్పుడు ఇక్కడ ఏలాంటి అనవాళ్లు కనిపించావు. ఇదేమిటని రైల్వే అధికారు లను ప్రశ్నిస్తే తామకేమి తెలియదనే సమాధానం వస్తుంది. వీటితో పాటు ఆరు లైన్లలో ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉండేవి. కాని ప్రస్తుతం అయిదు లైన్లు మాత్రమే ఉన్నవి. వీటిలో మూడు ప్లాట్ ఫాంలకు పోనూ మిగిలిన రెండు లైన్లులో ఒకటి గూడ్స్ కు, రెండోది క్రాసింగ్‌కు కేటాయించారు. నాడే పరిస్థితి చాల నయం, కాని ఇప్పుడు మారింత దయనీయంగా మారింది. ఇలా పేరుకే పెద్ద స్టేషన్ అయినప్పటికి పైన పటారం లోన లోటారం అన్నట్లుగా మారింది. సికింద్రాబాద్ నుంచి నాందేడ్ వరకు ఏ ఒక్కచోట కూడా యాక్సిడెంట్ రిలీఫ్ టీమ్ లేకపో వడం, అందుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడం శోచనీయం. గతంలో ప్రతి రెండు వందల కీలో మీటర్ల పరిధి లో తప్పకుండా ఒక యాక్సిడెంట్ రిలీఫ్ టీమ్‌తో పాటు ట్రైయి న్ వాషింగ్, ప్రత్యేక ప్రమాద నివారణ బృందాలు ఉండేవి. బ్రాడ్‌గేజ్ కాగానే వీటిని నిజామాబాద్ నుంచి నాందేడ్‌కు తరలించారు.కాని నాందేడ్ నుంచి 45 కిలో మీటర్ల దూరంలో ఉన్న పుణే స్టేషన్‌లోనూ ఈ ఏర్పాట్లు అన్ని ఉన్నాయి. వాస్తవా నికి నాందేడ్‌కు సికిద్రాబాద్‌కు మధ్యనున్న నిజామాబాద్ స్టేషన్‌లో గతంలో ఈ సౌకర్యాలు అన్ని ఉండేవి. బ్రాడ్‌గేజ్ అయిన ఏడాదిలోపే వీటన్నింటిని ఇక్కడి నుంచి తరలించడం విశేషం. కనీసం రైల్వే శాఖ నిబంధనల మేరకు అయిన ప్రతి రెండు వందల కిలో మీటర్ల పరిధిలో ఉండాల్సిన ఏర్పాట్లు సైతం నిజామాబాద్‌లో ఉండకపోవడంపై అటు రైల్వే ఉద్యో గులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ట్రాయిన్ వాషింగ్‌తో మెకానికల్ స్టాఫ్ సౌకర్యం ఉంటే స్థాని కులు ఉపాధి అవకాశాలు కూడా లాభిస్తాయి. గతంలో ఉన్న సౌకర్యాలు అన్నింటిని తొలగించి మోడల్‌గా ఉండాల్సిన స్టేషన్ ను రూపులేకుండా చేయడంపై ప్రయాణికులు పెదవి విరుస్తు న్నారు.నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఏలాంటి ప్రణాళి కలు లేవు, దానికి తోడు స్టేషన్ చుట్ట్టూ ఉన్న విలువైన స్థలాలల్లో ఇష్టారీతినా కట్టడాలను చేస్తున్నారు. స్టేషన్ ముందు నుంచి మాత్రం అవకాశం ఉండటంతో సగానికి పైగా నిజామా బాద్ ప్రజలతో పాటు ఆర్మూర్, కరీంనగర్ నుంచి వచ్చే ప్రయా ణికులు చుట్టు కిలో మీటర్ తిరిగి రావాల్సి వస్తుంది. నిజామా బాద్ రోజురోజుకు అభివృద్ధి చెందడంతో స్టేషన్‌కు రెండు వైపుల బుకింగ్, పార్కింగ్ స్థలాలను, ప్రయాణీకుల సౌకర్యాల ను ఏర్పాటు చేయాలి. కాని కనీసం మోటర్ సైకిళ్లు, కార్లు వెళ్లాని వైపు నుంచి వెనక భాగాన నార్త్ బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేసారు. ఈ కౌంటర్ నంబరు.1 ప్లాట్ ఫారమ్‌కు చాల దూరంగా ఉంటుంది. దీంతో ఇటువైపు వచ్చే ప్రయాణి కులు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్మూర్ రోడ్డు నుంచి వచ్చే రూట్‌లో రైల్వే స్థలం పుష్కాలంగా ఉంటుంది, ఈ ప్రాంత ంలో కౌంటర్ ఏర్పాటు చేస్తే అన్ని వర్గాలు, ప్రాంతాల వారికి సౌకరంగా ఉంటుందని చెబుతున్నారు ప్రయాణీకులు.ఇటీవల నిజామాబాద్ – పెద్దపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం రోజున మూడు పార్టీల నేతలు నానాహంగామా చేసిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి రైలు టిఆర్‌ఎస్ ఎంపి కవిత కృషితోనే పూర్తి అయిందని, లేదు లేదుకాంగ్రెస్ హయాంలోనే నిధులు తెచ్చా మని కాంగ్రెస్ నేతలు చెబితే, ఇవేవి కాదు బిజెపి ప్రత్యేకంగా దృష్టి సారిస్తే రైలు మార్గం పూర్తి అయి రైలు వచ్చిందనే పోటాపోటీగా ప్రకటనలు చేసి నానా హడావిడి చేసారు. ఇంత వరకు బాగానే ఉన్న స్టేషన్‌లో ఉన్న సమస్యలపై ఏ నేత స్పంది ంచకపోవడం విచిత్రంగా ఉంది. అంతేందుకు కనీసం రైల్వే స్టేషన్‌ను సందర్శించిన పాపాన పోలేదు. దీంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ మోడల్ గా మారడం సంగతి ఏలా ఉన్న ఉన్న సమ స్యలు మరింత జఠిలం అవడం ఖాయంగానే ఉంది.

No comments:

Post a Comment