Breaking News

01/05/2019

భారీగా పెరుగుతున్న రియల్ ఆదాయం

అదిలాబాద్, మే 1, (way2newstv.in)
ఆదిలాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ పరిస్థితి రివర్స్ అయింది.  ఆదిలాబాద్, మంచిర్యాల ల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినప్పటికి ఆదాయం గతేడాది కంటే కొంత అధికంగా రావడం ఊరటనిచ్చింది.కొత్త జిల్లాలుగా ఏర్పడినప్పటికి నిర్మల్, ఆసిఫాబాద్‌లలో ఆదాయం భారీగా పడిపోవటం రియల్ రంగాన్ని కలవరపెట్టిస్తొంది. ఉమ్మడి జిల్లాలో ఎనిమిది సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, బోథ్, మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్, లక్షేటిపేటలో ఉన్నాయి రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం పెట్టుకున్న అంచన తలకిందులైంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పడిపోయింది. దానికి తగ్గటుగానే ఆదాయం కూడా తగ్గిపోయింది. రెండేళ్ళ కిందటి కంటే తక్కువ ఆదాయం లభించంది. 2015-16 సంవత్సరంలో అన్ని రకాల దస్తా వేజులు కలిపి 43, 609 కాగా రూ.58.09 కోట్ల ఆదాయం లభించింది. 2016-17లో 37.149 రిజిస్ట్రేష న్లు కాగా రూ.53.61 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. 


భారీగా పెరుగుతున్న రియల్ ఆదాయం

గతేడాది కంటే ఈ ఏడాది 6.460 రిజిస్ట్రేషన్లు తగ్గగా ఆదాయం రూ.4.47 కోట్లు తక్కువగా సమకూరడంతో ప్రభుత్వానికి నష్టం జరిగింది ఆదిలాబాద్‌లో రిజిస్ట్రేషన్ల శాతం తగినప్పటకి ఆదాయం గతేడాది కంటే అధికంగా వచ్చింది.మంచిర్యా లలోనూ అదే పరిస్థితి ఉంది.నుగోలు దారులు అంతకుమించిన నగదు వ్యవహారాలు సాగిస్తే దానికి సంబంధించి పక్కా అధారాలు చూపించాల్సిన పరిస్థితి ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ముందడుగు పడటం లేదని, తద్వారా దస్తావేజులు ఆదాయం పరంగా రిజిస్ట్రేషన్ల శాఖకు తిరోగమనం కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఫిబ్రవరి వార్షిక ఆదాయం పరంగా సుమారు రూ.15 కోట్లు వెనుకంజలో ఉన్న ఉమ్మడి జిల్లాలో వార్షిక సంవత్సరంలో ముగిసే సరికి కొంత మెరుగుపడింది. ఒకటిన్నర నెలలో సుమారు రూ. 10 కోట్ల ఆదాయం లభించడంతో గతేడాది కంటే సుమారు రూ. 4.50 కోట్లు వెనుకబడిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొత్త జిల్లాలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు సేకరిస్తుడంతో ఆయా చుట్టూపక్కా ప్రాంతాల్లో రియల్ రంగం పెరిగి ఆదాయం లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో గతేడాది కంటే ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగినప్పటికి ఆదాయం మాత్రం సుమారు రూ.2.75 కోట్లు తక్కువగా లభించింది నిర్మల్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజనల్ కేంద్రం భైంసాలో గతేడాది కంటే రిజిస్ట్రేషన్లు, ఆదాయం పడిపోయాయి. ఆసిఫాబాద్, ఖనా పూర్, లక్షేటిపేట, బోథ్‌లోనూ అటు రిజిస్ట్రేషన్లు ఇటు ఆదాయం పడి పోయి ప్రభుత్వానికి నష్టం చేకూర్చింది.  మార్కెట్లో భూక్రయ, విక్రయాలన్నీ నిలిచిపోయాయి. కొత్త జిల్లాలు ఏర్పడిన కొత్తలో రియల్ రంగం జోరుగా సాగుతుందని భావించే సమయంలో ఇలాంటి పరిస్థితి రావడంతో రియల్ పురోగతిలో తిరోగమనం మొద లైంది అయితే కొత్త నోట్ల రాకా, మార్కెట్లో నోట్ల చలమాణి సాదారణం అయినట్లే కనిపించి తిరిగి ఇదే పరిస్థితి పునరావృతం అవుతుండంతో రియల్ రంగంలో కంగారు కనిపిస్తుంది. ప్రధానంగా రూ.2 లక్షలకు పైబడిన వ్యవహారాల్లో నగదుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయల్సిన పరిస్థితి ఇప్పటికి కొనసాగుతుండడంతో రియల్ రంగం కుదుటపడటం లేదన్న అభివప్రాయం వ్యక్తమౌవుతుంది.

No comments:

Post a Comment