Breaking News

21/05/2019

చకచకా కౌంటింగ్ ఏర్పాట్లు


వరంగల్, మే 21, (way2newstv.in)
ఓ వైపు లోక్‌సభ... మరోవైపు ప్రాదేశిక ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం సమీపిస్తోంది. ఏప్రిల్‌ 11వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగగా.. 43 రోజుల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నారు.వరంగల్, మహబూబాబాద్‌ లోక్‌సభ పార్లమెంట్‌ స్థానాల్లో పార్టీలు, స్వతంత్రులు కలిపి 29మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఆరు జిల్లాల పరిధిలోని 70 జెడ్పీటీసీ స్థానాలకు 403 మంది, 780 ఎంపీటీసీ స్థానాలకు 2,734 మంది రంగంలో ఉన్నారు. అంటే మొత్తంగా విజయం కోసం 3,166 మంది నిరీక్షిస్తున్నారు. ఈనెల 23వ తేదీన వెల్లడయ్యే లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాల్లో ఇద్దరు మాత్రమే విజేతలుగా నిలవనున్నారు. ఈ రెండు స్థానాల్లో ఫలితం కోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భారీగానే ఆశల్ని పెట్టుకున్నాయి. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా జరిగిన విషయం విదితమే. వరంగల్, మహబూబాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఆ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 



చకచకా కౌంటింగ్ ఏర్పాట్లు

దీనికి తోడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆరు జెడ్పీలు లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ సర్వశక్తులొడ్డగా.. 27న వెలువడే ఫలితాలతో ఎవరి ఆశలు ఎంత మేరకు ఫలించాయనేది బయటపడనుంది. మూడు రోజుల వ్యవధిలో అటు పార్లమెంట్, ఇటు ప్రాదేశిక ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీల నాయకులతో పాటు ఇటు ఓటర్లలో చర్చలు మొదలయ్యాయి.అసెంబ్లీ ఎన్నికల జోరును ఇక్కడ కూడా చూపిస్తామనే ధీమాతో గులాబీ దళంలో ఉండగా.. ఫలితం తమకు అనుకూలంగా వస్తుందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెబుతున్నాయి. ఇక వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, జనగాం, భూపాలపల్లి జయశంకర్, ములుగు జిల్లాల్లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరులో 18 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవిపోగా 70 జెడ్పీటీసీ, 762 ఎంపీటీసీ స్థానాల్లో తామే గెలుస్తామంటూ 3,137 మంది అభ్యర్థులు ఎవరికి వారు చెబుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ ఉన్నా.. అక్కడక్కడా స్వతంత్రులు గెలుపు బాటలో పయనించే అవకాశముందనే ప్రచారంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైందిఈనెల 23, 27.. ఈ రెండు తేదీలపైనే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు బోలెడు ఆశల్ని పెట్టుకున్నారు. అటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు ఇటు ప్రాదేశిక సమరంలో తలపడిన అభ్యర్థులంతా గెలుపు తమదేనన్న ఆశల లోకంలో విహరిస్తున్నారు. పనిలో పనిగా తమకు ఎన్ని ఓట్లు వస్తాయి.. మెజార్టీ ఎంత రావొచ్చంటూ లెక్కలేసుకుంటున్నారు. పార్టీల ఉనికిని కీలకంగా పరిగణించే ఈ ఫలితాల తీరుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రెండు ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమనే చెబుతున్నారు.అభ్యర్థుల అంచనాలను పక్కన పెడితే.. ఇంకోపక్క అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్‌ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఏనుమాముల మార్కెట్‌లో, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం ఈవీఎంలను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో భద్రపరిచారు. ఆయా కేంద్రాల్లో 24 గంటల భద్రత కొనసాగుతుండగా.. 23వ తేదీన జరిగే లెక్కింపునకు చేయాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

No comments:

Post a Comment