Breaking News

27/05/2019

టీడీపీ సీనియర్ నేతలు ఇక దూరమే..


కాకినాడ, మే 27 (way2newstv.in)
ఉత్తరాంధ్ర జిల్లాలోని పలువురు సీనియర్ల కెరీర్ కు ఈ ఎన్నికలు చరమగీతం పాడేశాయి. ఈసారి ఎట్టిపరిస్థితిలోనూ పోటీ చేయనని చెప్పిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బలవంతంగా పోటీ చేశారు. అంతా అనుకున్నట్లుగానే ఆయన పరాజయం పాలు అయ్యారు. ఏకంగా 22 వేల భారీ తేడాతో వైసీపీ అభ్యర్ధి పెట్ల ఉమా శంకర్ గణేష్ చేతిలో ఓడిపోయారు. ఒకనాటి తన శిష్యుడు, టీడీపీలో అనుచరుడు అయిన గణేష్ చేతిలో అయ్యన్న ఓడిపోవడం ఆయన రాజకీయ జీవితానికి బ్రేక్ పడేలా చేసింది. ఇప్పటికి తొమ్మిది సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచిన అయ్యన్న మూడుసార్లు ఓటమి పాలు అయ్యారు. అయితే ఇంతటి భారీ తేడాతో ఓడిపోవడం మాత్రం ఇదే తొలిసారి. ఈ దెబ్బతో అయ్యన్న రాజకీయాలకు గుడ్ బై చెబుతారని అంటున్నారు.ఇక పెందుర్తికి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వైసీపీకి చెందిన యువకుడు, పెద్దగా రాజకీయ అనుభవం లేనిఅన్నం రెడ్డి అదీప్ రాజ్ చేతిలో ఓటమిపాలు అయ్యారు. 


టీడీపీ సీనియర్ నేతలు ఇక దూరమే..
మూడున్నర దశాబ్దాలుగా రాజకీయ జీవితాన్ని కొనసాగించిన బండారు ఈసారి తన కుమారుడికి టికెట్ అడిగారు. అయితే చంద్రబాబు ఆయన్నే పోటీకి దింపారు. అయినా అయనకు ఓటమి తప్పలేదు. 1998 సమయంలో మునిసిపల్ శాఖా మంత్రిగా కూడా పనిచేసిన బండారు రాజకీయ జీవితం ఇపుడు ముగిసిపోయినట్లేనని అంటున్నారు. మరోమారు గెలిచి మంత్రి అవుదామని ఆశ పడిన ఆయనకు ఆ కోరిక తీరకుండానే పొలిటికల్ కెరీర్ క్లోజ్ కావడం విషాద పరిణానం.విజయనగరం జిల్లాలో 86 ఏళ్ల కురువృధ్ధుడు పతివాడ నారాయణస్వామి సైతం తన కొడుక్కి టికెట్ ఇమ్మని ఆడిగారు. అయితే హై కమాండ్ నో అనడంతో నెల్లిమర్ల నుంచి పోటీకి దిగారు. దాంతో భారీ తేడాతో ఆయన్ని వైసీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే బండుపల్లి అప్పలనాయుడు ఓడించేశారు. ఇక పతివాడ కధ ముగిసినట్లేనని అంటున్నారు. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి కిమిడి మృణాళినితో పాటు, శత్రుచర్ల విజయరామరాజు వంటి వారి కెరీర్ కూడా ఈసారితో సరి అంటున్నారు. అదే విధంగా శ్రీకాకుళంలో మంత్రి కిమిడి కళా వెంకటరావు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గౌతు శ్యామ సుందర శివాజీ కుటుంబం కూడా ఈసారి ఓటమి పాలు అయింది. మరి ఈ కుటుంబాలు మళ్ళీ రాజకీయంగా రాణిస్తాయా అన్నది పెద్ద ప్రశ్న అంటున్నారు.

No comments:

Post a Comment