హైదరాబాద్ మే 4 (way2newstv.in)
చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా చార్మినార్ చుట్టూ వాహనాల రాకపోకలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకుగాను బొల్లాడ్స్‌ల ఏర్పాటు పనులు నేడు ప్రారంభమయ్యాయి. చార్మినార్‌కు దారితీసే నాలుగు ప్రధాన రహదారుల ద్వారా వాహనాలను పూర్తిగా నియంత్రించడానికి బొల్లాడ్స్ అమర్చే నిర్మాణ పనులు గుల్జార్ హౌస్ మార్గంలో చేపట్టారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయ పరిసరాల్లోకి వాహనాల నియంత్రణకు ఈవిధమైన బొల్లాడ్స్ ఏర్పాటు చేశారు.
చార్మినార్ చుట్టూ బొల్లాడ్స్‌ల ఏర్పాటు
స్వర్ణదేవాలయం నమూనాను పరిశీలించిన జీహెచ్ఎంసీ అధికారులు ఇదే విధమైన బొల్లాడ్స్ ను చార్మినార్‌కు దారితీసే మార్గంలోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తం 125 బొల్లాడ్‌లను రూ. 2.38 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 28 బొల్లాడ్‌లు ఆటోమెటిక్ హైడ్రాలిక్ బొల్లాడ్‌లుగా ఏర్పాటు చేస్తున్నారు. వీటి మొదటి దశ పనులను గుల్జార్ హౌస్, మక్కా మజీద్ మార్గాల్లో ప్రారంభిచారు. రెండో దశ పనులను లాడ్ బజార్, సర్దార్ మహల్ మార్గాల్లో చేపట్టనున్నారు. నేడు ఉదయం గుల్జార్ హౌస్ సమీపంలో ఈ పనులను ప్రారంభించామని జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ దత్తుపంత్ తెలిపారు.
No comments:
Post a Comment