Breaking News

03/05/2019

మోదీకి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ

సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే కీలకమన్న ఇమ్రాన్
న్యూ డిల్లీ మే 3 (way2newstv.in)
ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించుకోవడం చాలా ముఖ్యమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు భారత ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. అయితే కశ్మీర్ అంశంపై చర్చిద్దామని మాత్రమే ఇమ్రాన్ ప్రతిపాదించారని, ఉగ్రవాదానికి సంబంధించిన ప్రస్తావన లేఖలో లేదని సమాచారం. 


మోదీకి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ

ఈ అంశంపై ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, చర్చలకు పాక్ సిద్ధంగా ఉన్నప్పటికీ, భారత్ మాత్రం అందుకు సిద్ధంగా లేదని చెప్పారు.ద్వైపాక్షిక చర్చలు జరుపుతామంటూ గత సెప్టెంబర్ లో కూడా మోదీకి ఇమ్రాన్ లేఖ రాశారు. చర్చలకు భారత్ కూడా సిద్ధమైంది. అయితే, కశ్మీర్ సరిహద్దులో ఒక బీఎస్ఎఫ్ జవాను, ముగ్గురు ఎస్పీవోలను పాక్ హతమార్చడంతో... చర్చలు జరపాలన్న నిర్ణయాన్ని కేవలం ఒక్క రోజులోనే భారత్ రద్దు చేసుకుంది. ఉగ్రవాదంపై పటిష్ట చర్యలను తీసుకునేంత వరకు పాక్ తో చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది.

No comments:

Post a Comment