Breaking News

17/05/2019

29 వరకు కోస్తాంధ్రలో వడగాలులు

విశాఖపట్టణం, మే 17, (way2newstv.in)
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న కోస్తాంధ్ర ప్రజలకు మరికొన్ని రోజులు ఈ బాధ తప్పేలా లేదు. ఈ నెల 29వ తేదీ వరకు కోస్తాంధ్రలో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 23వ తేదీ వరకు చాలాచోట్ల సాధారణం కంటే 2-3 డిగ్రీలు అదనంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. రానున్న ఆరు రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురవొచ్చని ఐఎండీ తెలిపింది. 


29 వరకు కోస్తాంధ్రలో వడగాలులు

శుక్ర, శనివారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని వెల్లడించింది.గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 20 నుంచి వరుసగా 3 రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 23 తర్వాత వడగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపింది. నెలఖరు వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని అంచనా వేసింది. 

No comments:

Post a Comment