విజయవాడ, ఏప్రిల్ 3(way2newstv.in)
వంగవీటి రంగా సోదరుడు నారాయణరావు తనయుడు వంగవీటి నరేంద్ర ప్రస్తుతం బీజేపీ తరఫున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. వంగవీటి కుటుంబ నేఫథ్యం ఉండటంతో బీజేపీ ఆయన్ను పార్టీలో చేర్చుకుని విజయవాడ ఈస్ట్ టికెట్ కేటాయించింది. వంగవీటి మోహన రంగా కుమారుడు రాధాకృష్ణ టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా పనిచేస్తుండగా... రంగా సోదరుడు నారాయణరావు తనయుడు వంగవీటి నరేంద్ర ప్రస్తుతం బీజేపీ తరఫున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.విజయవాడలో ప్రధాన రాజకీయ కుటుంబాల్లో ఒకటైన వంగవీటి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెరపైకి వచ్చారు.
వంగవీటి వంశంలో రాజకీయాల్లోకి ఐదో వ్యక్తి
దివంగత వంగవీటి మోహనరంగా సోదరుడైన నారాయణరావు కుమారుడు వంగవీటి నరేంద్ర తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా రంగంలో ఉన్నారు. రెండు దశాబ్దాలుగా బ్యాంకు ఉద్యోగిగా పనిచేసిన వంగవీటి నరేంద్ర... ఈ మధ్యే ఉద్యోగాన్ని వదిలిపెట్టి బీజేపీలో చేరారు. ఉన్నత విద్యావంతుడు కావడం, వంగవీటి కుటుంబ నేఫథ్యం ఉండటంతో బీజేపీ కూడా ఆయన్ను పార్టీలో చేర్చుకుని విజయవాడ ఈస్ట్ టికెట్ కేటాయించింది.వంగవీటి కుటుంబ వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఐదో వ్యక్తిగా నరేంద్ర నిలిచారు. అప్పట్లో వంగవీటి మోహనరంగాతో పాటు ఆయన సోదరుడు రాధాకృష్ణ రాజకీయాల్లో రాణించగా... ఆ తర్వాత రంగా భార్య రత్నకుమారి, కుమారుడు రాధాకృష్ణ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అయితే వంగవీటి వారసత్వాన్ని నిలబెట్టడంలో రాధా విఫలం కావడంతో విజయవాడ రాజకీయాల్లో గతంలో రంగాకు అనుచరులుగా పనిచేసిన వారంతా ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో వివిధ పార్టీల తరఫున అభ్యర్ధులుగా నిలిచారు. అదే సమయంలో స్వయానా రంగా కుమారుడైన రాధాకృష్ణ... పోటీకి దూరంగా ఉంటూ టీడీపీకి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.
No comments:
Post a Comment