Breaking News

24/04/2019

ఆ ఆరు గంటల పాటు కలప స్మగ్లింగ్

అదిలాబాద్, ఏప్రిల్ 24, (way2newstv.in)
అటవీ అధికారుల  అండదండలతో అటవీ స్మగ్లర్లు రెచ్చిపోతూ విలువైన సంపదను నాశనం చేస్తున్నారు.రాత్రి కలపతో పాటు, తడకలు, ఇతర వాహనాలు అధిక సంఖ్యలో తరలివెళ్లినట్లు సమాచారం. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు సిబ్బంది విధి నిర్వహణలో లేనికారణంగా వాహనాలు తరలివెళ్లినట్లు సమాచారం.  అటవీ సంపదను కాపాడేందుకు కడెం రేంజ్ పరిధిలోని పాండ్వాపూర్ సమీపంలో అటవీశాఖ తనిఖీ కేంద్రం తూతూమంత్రంగా మారిపోయింది. ఈ తనిఖీ కేంద్రంలో ప్రతిరోజూ సంబంధిత అటవీ బీట్ అధికారులు విధులు నిర్వహించాల్సి ఉంది. 


ఆ ఆరు గంటల పాటు కలప స్మగ్లింగ్

కడెం రేంజ్ పరిధిలోని దస్తురాబాద్, పెద్దూర్, గంగాపూర్ సెక్షన్ల పరిధిలో పాండ్వాపూర్, లక్ష్మీపూర్, కడెం, కల్లెడ తదితర బీట్‌లు పని చేస్తున్నాయి. ఈ పరిధిలో కొన్నేళ్ల నుంచి అటవీ స్మగ్లర్లు విలువైన సంపదను గోదావరి గుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.ఈ తతంగం అంత అటవీ అధికారులకు తెలిసినా మామూళ్ల ముసుగులో పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉడుంపూర్ రేంజ్ పరిధిలోని పలు బీట్ల నుంచి ప్రతిరోజూ డీసీఎంల ద్వారా అర్ధరాత్రి నిర్మల్ కేంద్రంగా తడకలను తరలిస్తున్నారు. ఇవి నిర్మల్, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాలంటే ప్రధానకేంద్రం పాండ్వాపూర్ అటవీ తనిఖీ కేంద్రాన్ని దాటి వెళ్లాల్సిందే. ఈ విషయంలో సంబంధిత అటవీ అధికారులు స్మగ్లర్లతో కుమ్మకై విలువైన అటవీ సంపదను తరలిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి విధి నిర్వహణలో ఉండాల్సిన సంబంధిత తనిఖీ కేంద్రం అధికారులు లేనికారణంగా భారీ సంఖ్యలో వాహనాలు తరలివెళ్లాయి.సంబంధిత బీట్ అధికారి లేని కారణంగా వాచర్ వచ్చినా వాహనాలను పంపిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 

No comments:

Post a Comment