మండిపడుతున్న ద్వితీయశ్రేణి నాయకులు
హైద్రాబాద్, ఏప్రిల్ 3, (way2newstv.in)
టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధులకు స్థానిక ఎమ్మెల్యేలు సహాయ నిరాకరణ చేస్తున్నారు. పైకి ఎంపీ అభ్యర్ధితో సఖ్యతగా ఉంటూనే లోపాయికారిగా ప్రతిపక్ష అభ్యర్ధులకు మద్దతు తెలుపుతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చివరి వరకు సిట్టింగ్స్‌కు టిక్కెట్లు వస్తాయో లేదో అని టెన్షన్ పడిన ఎమ్మెల్యేలు, ఆ ఎన్నికల్లో గెలిచాక, మంత్రి పదవుల కోసం ఎదురు .చూశారుటీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చేందుకు ఆపార్టీ ప్రజా ప్రతినిధులే పావులు కదుపుతున్నారు! ఇప్పటికే కెపాసిటీకి మించి నేతలతో నిండిపోయిన కారులో ఒకరి రాజకీయ భవిష్యత్ కోసం మరొకరు 'చెక్' పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నారు.
గులాబీలో నేనే రాజు నేనే మంత్రి...
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. . ఆ రేసులో ఓడిపోయిన ఆశావహులు...ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో అధినేతకు తమ బలమేంటో తెలియచెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 'కారు-సారు- పదహారు' నినాదం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది. 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే...ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా తమకు ఎలాంటి పలుకుబడి ఉండబోదని వారు భావిస్తున్నారు. అధినేత, ఆయన కొడుకు దూకుడు తగ్గాలంటే...16 సంఖ్యను గణనీయంగా తగ్గించేలా యోచిస్తున్నట్టు సమాచారం. కనీసం ఐదారు ఎంపీ స్థానాల్లో స్థానిక అధికారపార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు సహకరించేలా పావులు కదుపుతున్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల్లోనే చర్చనడుస్తున్నది. చేవెళ్ల నియోజకవర్గంలో స్థానిక అధికారపార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్ధి విశ్వేశ్వరరెడ్డితో 'టచ్'లో ఉన్నారని వినికిడి. రాష్ట్రంలో రెండోసారి అధికారం
No comments:
Post a Comment