Breaking News

05/04/2019

కలలు సాకారం.. (కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, ఏప్రిల్ 05 (way2newstv.in): ఎన్నో సంవత్సరాలుగా వేచి చూసిన స్వప్నం సాకారమైంది. రెండు ప్రాంతాలను కలిపే వారధులు అందుబాటులోకి రావడంతో రాకపోకలకు మార్గం సుగమమైంది. చాలా ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు తొలగిపోయాయి. బందరు, కోడూరు మండలాలకు వంతెనను ఉల్లిపాలెం-భవానీపురం మధ్య నిర్మించారు. ఎన్నో సంవత్సరాలుగా అటు దివిసీమ వాసులకు, ఇటు మచిలీపట్నం పరిసర గ్రామాల ప్రజలకు ప్రధాన ఆకాంక్షగా ఉన్న సేతువు నిర్మాణం పూర్తికావడంతో ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అలాగే కృత్తివెన్ను, ఎ.కొండూరు, కైకలూరు మండలాల్లో వంతెనల నిర్మాణాలతో రైతులకు, గ్రామస్థులకు ఎంతో మేలు చేకూరుతోంది.అవనిగడ్డ నియోజకవర్గ పరిధి కోడూరు మండలంలోని ఉల్లిపాలెం గ్రామానికి మచిలీపట్నం నుంచి రాకపోకలు సాగించాలంటే సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. 


కలలు సాకారం.. (కృష్ణాజిల్లా)

కోడూరు మండలం ఉల్లిపాలెం, బందరు మండలం భవానీపురం మధ్య వారధి నిర్మాణతో ప్రయాణ దూరం బాగా తగ్గింది. దివిసీమ ప్రాంతమైన కోడూరు నుంచి మచిలీపట్నం చేరుకునేందుకు దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర దూరం తగ్గింది.మండలంలోని చినగొల్లపాలెం దీవివాసుల చిరకాల స్వప్నం కాళీపట్నం-చినగొల్లపాలెం మధ్యన వంతెన నిర్మాణం. ఆర్‌అండ్‌బీ నిధులు రూ.26 కోట్లతో నిర్మించారు. చినగొల్లపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మధ్య రాకపోకలకు వెసులుబాటు కలిగింది. దీవిలో పండించే కొబ్బరి, సరివి, మామిడి, సపోట తదితర పంటలను గతంలో లాంచీలపై ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి వచ్చేది. వంతెన నిర్మాణంతో సమయం ఆదా కావడమేగాక 90 శాతం దీవివాసులకు భీమవరంతో వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. పడతడిక-లక్ష్మీపురం పల్లెపాలెం మధ్య పిన్నేరు వంతెనను సుమారు రూ.11 కోట్ల జాతీయ తుపాను విపత్తు నివారణ సంస్థ నిధులతో నిర్మించారు. దీంతో చినగొల్లపాలెం పల్లెపాలెం, పడతడిక, దండుదారి, బొడ్డువానిపాలెం, బస్వానివారిపేట గ్రామాల ప్రజలకు భీమవరం ప్రయాణం 15 కిలోమీటర్ల మేర తగ్గింది. నిడమర్రు పంచాయతీ ఒర్లగొందితిప్ప-నిడమర్రు గ్రామాల మధ్య గోగిలేరుపై ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు రూ.40 లక్షలతో కాలిబాట వంతెన నిర్మించారు. గత నెల 11వ తేదీన ప్రారంభించారు.

No comments:

Post a Comment