Breaking News

30/04/2019

మండలికి మళ్లీ కిరీటం...

విజయవాడ, ఏప్రిల్ 30, (way2newstv.in)
అవనిగడ్డ రాజకీయం అంచనాలకు అందడం లేదు. ఇక్కడి నుంచి ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. మండలి సీనియారిటీనిగుర్తించిన చంద్రబాబునాయుడు ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చారు. అయితే మరోసారి అవనిగడ్డ నుంచి మండలి బుద్దప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఆయన కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు ఉన్నారు. జనసేన తరుపున ముత్తంశెట్టి కృష్ణారావు ఉన్నారు.అవనిగడ్డ తొలి నుంచి మండలి కుటుంబానికి కంచుకోటగా ఉంది. ఆయన 1999, 2004 ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున గెలుపొందారు. 2009లో టీడీపీ అభ్యర్థి అంబటి బ్రాహ్మణయ్య చేతిలో మండలి బుద్ధప్రసాద్ ఓటమిపాలయ్యారు. 


మండలికి మళ్లీ కిరీటం...

తిరిగి 2014లో ఆయన టీడీపీలో చేరి విజయం సాధించారు. గత ఎన్నికల్లో మండలి బుద్ధప్రసాద్ వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుపై ఆరువేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈసారి అవనిగడ్డలో జనసేన పార్టీ బరిలోకి దిగడంతో ఆ ఎఫెక్ట్ కొంతఉన్నా మండలి బుద్ధప్రసాద్ తక్కువ ఓట్ల మెజారిటీతోనైనా బయటపడతారాని లెక్కలు గడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ వేవ్ కొంతఎక్కువగా ఉండటంతో అవనిగడ్డలోనూ వైసీపీ జెండా ఎగురుతుందని ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు అంచనా వేశారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయిన సింహాద్రి రమేష్ మీద సానుభూతి ఉంటుందని భావించారు. కానీ మండలి బుద్ధప్రసాద్ నియోజకవర్గంలోచేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే ఆయనను గెలుపు బాటపట్టిస్తాయంటున్నారు. సింహాద్రి రమేష్ బాబుపై సానుభూతిఉన్నప్పటికీ మండలి అంటే గౌరవం, అభిమానం ఆయన వైపు ప్రజలు తిరగడానికి కారణమయ్యాయంటున్నారు.జనసేన అభ్యర్థి ముత్తం శెట్టి కృష్ణారావు కూడా బలమైన వ్యక్తి. కాపు సామాజిక వర్గానికే చెందిన అభ్యర్థి కావడంతో ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లను ఎవరు ఎక్కువ చీల్చుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇది వైసీపీ అభ్యర్థికి ఎఫెక్ట్ గా కొందరు చెబుతున్నారు. మండలి బుద్ధప్రసాద్ లాంటి నేతలు అసెంబ్లీలో ఉండాలన్న నినాదం బాగా పనిచేసిందన్న టాక్ నియోజకవర్గంలో విన్పిస్తోంది. మండలి బుద్ధప్రసాద్ ఎన్నికలకు ముందు కొంత ఇబ్బంది పడినా పోలింగ్ నాటికి అనూహ్యంగా పుంజుకున్నారని, అవనిగడ్డలో మరోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

No comments:

Post a Comment