హైద్రాబాద్, మార్చి 20, (way2newstv.in)
జంటనగరాల్లో ఒకటైన హైదరాబాద్ స్థానానికి ఘనమైన చరిత్రే ఉంది. 1952 నుంచి వరుసగా ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతుండగా.. మొదట్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. వరుస విజయాలు నమోదు చేసింది. కానీ, 1980ల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఏఎంఐఎం(ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహదుల్ ముస్లిమీన్) పార్టీ తరపున సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ.. 1984లో తొలిసారిగా ఇక్కడ విజయాన్ని నమోదు చేశారు. అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కంచుకోటగా మలుచుకున్నారు.
పాతబస్తీలో కింగ్ ఎవరు
1984 నుంచి 2004 వరకు.. వరుసగా హైదరాబాద్ ఎంపీగా సల్లావుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. అనంతరం ఆయన రాజకీయ వారసుడిగా అరంగ్రేటం అసదుద్దీన్ ఓవైసీ.. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం విజయపరంపరను కొనసాగిస్తున్నారు.హైదరాబాద్ పార్లమెంట్ స్థానం.. ఎక్కువగా పాతనగరంలోనే విస్తరించి ఉంది. నిజాం హయాంలో విస్తరించబడిన నగరం కావడంతో హైదరాబాద్ పరిధిలో పాతబస్తీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. నవాబుల కాలంలో నిర్మితమైన చారిత్రక కట్టడాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ముస్లిం జనాభా ఎక్కువగా కలిగిన ప్రాంతం కావడంతో.. ఇక్కడ ముస్లిం పార్టీగా మజ్లిస్ హవా కొనసాగిస్తూ వస్తోంది. ప్రతీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించడంలో.. పాతబస్తీ వాసులు కీలకంగా మారుతున్నారు
No comments:
Post a Comment