Breaking News

18/03/2019

ముహర్తాల కోసం... డెలీవర్రీలు

ఏలూరు, మార్చి 17, (way2newstv.in)
కాలం మారుతున్న కొద్దీ ట్రెండ్స్  మారిపోతున్నాయి. బిడ్డలు నెలలు నిండిన తర్వాత పుట్టడం పాతకాలం.. మూహూర్తం చెప్పిన ప్రకారం పుట్టడం నేటికాలం.. 9 నెలల పాటు అమ్మ కడుపులో గడిపిన బిడ్డను బయటికి తెచ్చే సమయంపై తల్లిదండ్రులు పెడుతున్న శ్రధ్ద అంతా ఇంతా కాదు. శిశువు పుట్టకమునుపే.. పురోహితుల వద్దకు వెళ్లి పంచాం గాలు వెతికి ముహూర్తం ఖరారుచేస్తున్నారు. డెలివరి డేట్‌కు ముందు ఒక నెల నుంచి జాతకాలు.. తిధి.. నక్షత్రం.. రోజు.. రాహుకాలం.. యమగండం..ఘడియలు.. లాంటివి చూసుకుని ఆసుపత్రి వైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న వారిలో చాలామంది ముహూర్తాలను చూసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు 30 నుంచి 40 శాతం మంది తిథి, ఘడియలు, నక్షత్రాలు చూసుకుని ఆస్పత్రులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. 


ముహర్తాల కోసం... డెలీవర్రీలు

అయితే ప్రసవానికి ఇంకా సమయమున్నా ముహూర్తాల వెర్రిలో పడి వారం, పదిరోజుల ముందే ఆపరేషన్‌కు సిద్ధమవడం కరెక్టు కాదని పెద్దలు సూచిస్తున్నారు. ఎందుకంటే బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలలు నిండేవరకు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడన్నది వైద్యుల సూచన. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు...ముహూర్తాలు తర్వాత లేదనో క్రమంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు వైద్యులు సిజిరేయిన్‌ చేయాల్సి వస్తోంది. రెండు, మూడు రోజుల వ్యవధిలో చేసినా ఏం కాదుగానీ, పది, పదిహేనురోజుల తేడాతో ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటికి తీస్తే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని గైనకాలజిస్టులు స్పష్టం చేస్తున్నారుఎందుకంటే గతంలో మాదిరికాకుండా ఇప్పు డు డెలివరీ డేట్‌ ముందుగానే తెలుస్తుండటంతో ఎక్కువమంది ‘ఒకరోజు’ ఫిక్స్‌ చేసుకుంటున్నారు. శుభఘడియలను చూసుకుని ఇంట్లో నుంచి బయట పడుతున్నారు.మూడు నెలల ముందో వైద్యులు డెలివరీ డేట్‌ ఇస్తారు. ఎప్పటికప్పుడు బిడ్డ పరిస్థితిని చూస్తూ పలు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తుంటారు. తల్లిదండ్రులు పురోహితుల వద్దకు వెళ్లి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో లేకపోయినా ఇటీవల కాలంలో చాలామంది సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ వస్తున్నారు. ఇంటి దేవతలకు ఇష్టమైన రోజును ఎంపిక చేసుకుని ఎవరికి వారు ముందుకు వెళుతున్నారు. పుట్టిన మరుక్షణమే ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన సమయాన్ని తీసుకుని జాతకాన్ని రాయిస్తున్నారు. 

No comments:

Post a Comment