Breaking News

08/03/2019

అభివృద్ధి కి దూరంగా ఉన్న ఎర్రబంజర ఎస్సి కొత్త కాలనీ

ఖమ్మం, ఫిబ్రవరి 8 (way2newstv.in)
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబంజర ఎస్సీ కొత్త కాలనీలో ప్రజలు మౌలిక సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొత్త కాలనీలో అనేక సంవత్సరాలుగా నివసిస్తున్నామని,  అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కనీసం రోడ్లకు ఒక పిడికెడు మట్టి కూడా పోయలేదని ఆవేదన చెందారు. నడవటానికి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని వర్షం వస్తే జలమయం అవుతుందని పిల్లలు స్కూల్ కు వెళ్లాలన్న, వడ్లు పట్టించుకోవాలంటే లోపలి నుంచి రోడ్డుపైకి మోసుకొని పోవాలని ఆటోలు లోపలికి వచ్చే పరిస్థితి లేదని వారన్నారు .

 అభివృద్ధి కి దూరంగా ఉన్న ఎర్రబంజర ఎస్సి కొత్త కాలనీ

రాత్రి వేళలో సరిగ వీధి లైట్లు వెలగడం లేదని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని అన్నారు. అనేక సందర్భాలు ఎవరికి మా గోడు వినిపించిన పట్టించుకునే నాధుడు కరువయ్యాడని అన్నారు .గతంలో ఉన్న సర్పంచ్ గాని ఎటువంటి  సౌకర్యాలూ కల్పించలేదని బాధను వ్యక్తం చేశారు.  త్రాగునీరు కూడా మురికి నీళ్లు వస్తాయని తెలిపారు.పాడైపోయిన చేతిపంపు ఆరు నెలలు గడిచినా దాన్ని పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ఆవేదన చెందారు. ప్రతిసారి ఓట్లు కోసం వస్తున్నారు తప్ప రోడ్డు లేస్తాం డ్రైనేజీలు కడతాం సిసి రోడ్లు ఇస్తామని మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ని ఇప్పటివరకు కన్నెత్తి చూడటం లేదని అన్నారు .ఇట్టి పరిస్థితులలో ఇప్పటికైనా అధికారులు మా మీద దయఉంచి రోడ్ల మరమ్మతులు చేపట్టి  వీధిలైట్లు సక్రమంగా ఉండేటట్లు చూడాలని వారు కోరారు.

No comments:

Post a Comment