భోపాల్, మార్చి 28 (way2newstv.in)
దిగ్విజయ్ సింగ్…. సీనియర్ నేత.. డిగ్గీరాజా అనేది ముద్దుపేరు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ జెండా ఎగరడంతో తిరిగి దిగ్విజయ్ సింగ్ ప్రతిష్ట ఇంటా, బయటా పెరిగిందనే చెప్పాలి. దాదాపు ఒకటన్నర దశాబ్దకాలం పాటు ప్రతిపక్షంలోనే ఉన్న కాంగ్రెస్ విజయంలో దిగ్విజయ్ సింగ్ దీ కీలకపాత్రే. ఆయన మధ్యప్రదేశ్ ఎన్నికలకు ముందు దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను ఆ వయసులో చేసి రికార్డు సృష్టించారు. ఇది కూడా కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు ఒక కారణంగా చెబుతారు.మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దిగ్విజయ్ సింగ్ మళ్లీ పుంజుకున్నారు. తన రాజకీయ చతురతను ఉపయోగించి ముఖ్యమంత్రిగా కమల్ నాధ్ ను ఎంపిక చేయగలిగారు. అయితే రాహుల్ గాంధీ టీం లో మాత్రం దిగ్విజయ్ కు చోటు లేదనే చెప్పాలి. ఆయన గతంలో పార్టీ వ్యవహరాల ఇన్ ఛార్జిగా ఉన్న గోవా, తెలంగాణ, కర్ణాటకల నుంచి తప్పించారు రాహుల్.
డిగ్గీరాజా తొడకొడతారా
మధ్యప్రదేశ్ కే పరిమితం చేశారు. దిగ్విజయ్ చేసే ట్వీట్లు, ప్రకటనలు తరచూ పార్టీని ఇబ్బంది పెడతాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే గోవాలో అధికారాన్ని చేజేతులా కోల్పోవాల్సి వచ్చిందన్నది కాంగ్రెస్ సీనియర్ నేతల అభిప్రాయం.ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వేళ దిగ్విజయ్ సింగ్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి డిగ్గీ రాజాను పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకుందంటేనే డిగ్గీరాజాను పొమ్మనకుండా పొగబెట్టడమే. భోపాల్ నుంచి పోటీ చేసేందుకుద తొలుత విముఖత చూపించిన దిగ్విజయ్ సింగ్ అధిష్టానం వత్తిడితో అంగీకరించాల్సి వచ్చింది. తాను భోపాల్ నుంచి పోటీ చేస్తారని డిగ్గీరాజా ఎట్టకేలకు చెప్పారు.అయితో్ భోపాల్ లోక్ సభ నియోజకవర్గం చరిత్ర చూస్తే డిగ్గీరాజా ఎన్నికవ్వడం చాలా కష్టమేనంటున్నారు. ఇది కాంగ్రెస్ కు కష్టమైన స్థానం. ఇక్కడ మూడు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ క్యాడర్ కూడా బలంగా లేదు. ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలంగా ఉంది.1984 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా గెలవని భోపాల్ కు డిగ్గీని పంపి ఆయనకు క్లిష్టమైన పరీక్ష పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. చివరిగా గెలిచింది కాంగ్రెస్ తరుపున ఇక్కడ శంకర దయాళ్ శర్మ మాత్రమే. మరి డిగ్గీరాజా ఇక్కడ నెగ్గుకొస్తారో ? లేదో? చూడాలి.
No comments:
Post a Comment