Breaking News

28/03/2019

లోకసభలో అన్ని కొత్త ముఖాలే

గుంటూరు, మార్చి 28  (way2newstv.in)
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 11న రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారన్న దానిపై స్పష్టత వచ్చేసింది. దీన్ని బట్టి చూస్తే ఏపీలోని లోక్‌సభ స్థానాల్లో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని 25లోక్‌సభ స్థానాల్లో ఒక్క చోట కూడా ప్రధాన పార్టీల తరపున గత ఎన్నికల్లో పోటీ పడిన ప్రత్యర్థులు మళ్లీ తలపడటం లేదు.


లోకసభలో అన్ని కొత్త ముఖాలే

ప్రతిపక్షం వైసీపీ కడప, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాల్లో మినహా అన్నిచోట్లా అభ్యర్థులను మార్చేసింది. మరోవైపు టీడీపీ శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, హిందూపురం, చిత్తూరు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులనే అధికార పార్టీ బరిలో దింపింది. మిగిలిన చోట్ల అభ్యర్థులను మార్చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన మాగంటి మురళీమోహన్ స్థానంలో ఆయన కోడలు రూపాదేవికి, అనంతపురం నుంచి జేసీ దివాకర్‌రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డికి టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. 

No comments:

Post a Comment