Breaking News

30/03/2019

విశాఖలో నయా ట్రెండ్... బాండ్ రూపంలో హామీ

విశాఖపట్టణం, మార్చి 30(way2newstv.in)
ఒకప్పుడు రాజకీయ నేతల నోటి మాటను గుడ్డిగా నమ్మేసేవారు. కానీ, ఆ మాటలు ఒట్టి మూటలేనని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చేందుకు హమీలిచ్చి హ్యాండిస్తారనే అపనమ్మకం ఇటీవల బాగా పెరిగింది. దీంతో మీ మాటలను నోటితో కాదు.. బాండు పేపర్ ‘నోటు’తో చెప్పండని ఓటర్లు అడుగుతున్నారు. విశాఖలో ఇప్పుడు ఈ ట్రెండే నడుస్తోంది. తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు రాజకీయ నేతలకు చెమటలు పట్టిస్తోంది. ఇష్టానుసారం హామీలిస్తే బుక్కైపోతామనే ఆందోళన వారిని వెంటాడుతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని బీమ్‌నగర్‌లో ఉన్న అసోసియేషన్‌ ఆఫ్‌ అర్బన్‌ అండ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ నిరాశ్రయుల కోసం వసతి గృహాలను కోరుతూ వస్తోంది. 


విశాఖలో నయా ట్రెండ్... బాండ్ రూపంలో హామీ

ఈ సమస్యను పరిష్కరిస్తామని నేతలు హామీలిస్తున్నా.. అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో తమకు ఎవరైతే తమ హామీలు నెరవేరుస్తామని బాండు పేపరు మీద రాసిస్తారో వారికే ఓటు వేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్‌ స్పందించారు. వారి హామీలను తీరుస్తామంటూ వంద రూపాయల బాండు పేపరు మీద సంతకం చేశారు. మొత్తం పదమూడు అంశాలతో కూడిన సమస్యలను తీరుస్తానని, ప్రతీ మూడు నెలలకు ఒకసారి అక్కడికి వచ్చి వారి బాధలు తెలుసుకుంటానని ఆ స్టాంప్‌ పేపర్‌పై రాసిచ్చారు.  రాజకీయ నేతలు బాండు పేపరు మీద సంతకాలు చేయాలనే డిమాండుకు శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ. ప్రజా సమస్యలు, పర్యావరణం ఎన్నో ఉద్యమాలను చేపట్టిన శర్మ.. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, పాలకులు మారినా పేదలు, నిరాశ్రయుల జీవితాలలో వెలుగు రేఖలు రావడం లేదనే ఆందోళనతో ఆయన వంద రూపాయల స్టాంప్‌ పేపర్‌పై హామీ ఇవ్వాలన్న ప్రతిపాదన తీసుకువచ్చారు.  జనసేన నుంచి విశాఖ ఎంపీగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ సైతం జనసేన మేనిఫెస్టోను బాండ్ పేపర్‌లో పెట్టి సంతకం చేస్తానని తెలిపారు. చెప్పినవి చేయకపోతే తనను కోర్టుకు లాగొచ్చని ఆయన తెలిపారు. జనసేనకు చెందిన మరికొందరు నేతలు కూడా బాండ్ పేపరు మీద సంతకాలు చేసి హామీ ఇస్తూ కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ఇది మరింత ఉదృత రూపం దాల్చితే నేతల్లో కొంతవరకైనా మార్పు రావచ్చేమో. 

No comments:

Post a Comment