Breaking News

26/03/2019

ముందుకు సాగని చీక్‌మాన్‌ జలాశయం పనులు

కరీంనగర్, మార్చి 26 (way2newstv.in)
సిరికొండ మండలంలోని చీక్‌మాన్‌ జలాశయం సిరికొండ, రాంపూర్‌ వాగుపై నిర్మించారు.మండలంలో ఉన్న 8 వేల రైతు కుటుంబాలు మూడు కాలాల పాటు పంటలు పండించడంతో మరో 3 వేల కుటుంబాల రైతు కూలీలకు నిత్యం పని దొరుకుతుంది. వీటితో పాటు ఈ ప్రాంతంలో కేవలం పత్తి పంటపైనే 95 శాతం మంది రైతులు ఆధారపడగా నీరు ఉంటే విభిన్న పంటల సాగు, పండ్ల తోటల సాగు, డెయిరీ పరిశ్రమలు, ఇతరత్రా పరిశ్రమలు నెలకొల్పేందుకు అవకాశముంటుంది. ఆదివాసీ, గిరిజన రైతులు ఎక్కువగా ఉండడంతో వారి సమస్య దాదాపుగా పరిష్కారం కావడంతో పాటు వారి అభివృద్ధికి అవధులు ఉండవు. వారి జీవన విధానంలోనూ అభివృద్ధి ఉరకలేస్తోంది. నీటిని సిరికొండలోని 19 పంచాయతీలతో పాటు ఇంద్రవెల్లి మండలంలోని కొన్ని గ్రామాలు, గుడిహత్నూర్‌ మండలంలోని కొన్ని గ్రామాలకు సాగు నీటిని అందించే ఆస్కారముంది. కాలువల నిర్మాణం చేపట్టడంతో ప్రాచీన చెరువులైన వాయిపేట్‌, లచ్చింపూర్‌(బి), పోచంపల్లి చెరువులకు నీటిని పంపడంతో అక్కడ స్టోరేజితో పాటు మత్య్స సంపదను పెంచుకునే అవకాశం ఉంటుంది.ఇది 2002లో మంజూరు కాగా 2005లో పనులు ప్రారంభించారు. 2008లో వీటి పనులు పూర్తి చేశారు. అప్పటి లక్ష్యం 3000 ఎకరాలకు సాగు నీరు అందించడం. 


ముందుకు సాగని  చీక్‌మాన్‌ జలాశయం పనులు

కానీ అధికారుల, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో కనీసం వంద ఎకరాలకు కూడా సాగు నీరందని పరిస్థితి. అస్తవ్యస్తంగా కాలువల నిర్మాణం, నిర్మాణంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. జలాశయంలో దాదాపుగా 25 వేల ఎకరాలకు సాగునీటిని అందించే సామార్థ్యం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం రీ డిజైన్‌ చేయడంతో అధిక నీటిని స్టోరేజ్‌ చేసి పంటపొలాలకు సాగునీటిని అందించే ఆస్కారముంది. రీ డిజైన్‌ చేస్తే  దాదాపుగా 200 ఎకరాల వరకు సాగు భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.చీక్‌మాన్‌ జలాశయంలోనూ భారీ స్థాయిలో మత్స్య సంపదను పెంచుకునే ఆస్కారం ఉండడంతో లాభాలను పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.ఈ నీటిని అటవీ ప్రాంతమైన పెంబి, ఖానాపూర్‌కు చీక్‌మాన్‌ వాగు ద్వారా వదిలితే అడవిలోని జంతువులకు నీటి సమస్యను పరిష్కరించడంతో పాటు అటవీ జంతువుల సంఖ్య పెరిగేందుకు ఆస్కారముంటుంది.జలాశయానికి దాదాపుగా వచ్చే నీటిలో 90 శాతం వృథాగానే పోతుంది. నీరంతా నిలువ ఉంటే రెండేళ్లు వర్షాలు కురవకపోయినా ఈ మండలానికి నీటి సమస్య రాదు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఇలా కట్టపై భాగం వరకు నీరు రాగా ఇలా అలుగు ద్వారా దాదాపుగా 7 గంటల పాటు నీరంతా వృథాగా పోయింది. ఈ నీటి తాకిడితోనే కొండాపూర్‌ వంతెనకు ఇరువైపులా ఉన్న రహదారి కొట్టుకుపోయింది.
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయొచ్చు..

No comments:

Post a Comment