వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం `బ్రోచేవారెవరురా` సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు లెటెస్ట్ సెన్సేషన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కనపడతున్నారు. ఈ త్రయం రంగురంగుల దుస్తులు, షేడ్స్‌తో స్కూటర్ రైడ్ చేసేలా ఈ పోస్టర్ ఉంది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం `బ్రోచేవారెవరురా`. `చలనమే చిత్రము.. చిత్రమే చలనము..` అనేది ట్యాగ్ లైన్.
విష్ణు `బ్రోచేవారెవరురా` ఫస్ట్ లుక్ విడుదల
శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటిస్తుండగా సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు:
శ్రీవిష్ణు, నివేదా థామస్, సత్యదేవ్, నివేదా పేతురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు
No comments:
Post a Comment