Breaking News

23/03/2019

ఉపాధి కోసం కూలీలు

ఖమ్మం మార్చి 23  (way2newstv.in)
కూలీలు ప్రస్తుతం ఉపాధి బాట పడుతున్నారు. వేసవి కావటంతో కూలీలను దృష్టిలో పెట్టుకొని అధికారులు కొంత సడలింపులు ఇవ్వటంతో పాటు అదనపు భత్యాలను కల్పిస్తున్నారు.ఎండలు ఎక్కువగా ఉండటంతో వేసవి భత్యాన్ని ఫిబ్రవరి నుంచి చెల్లిస్తున్నారు. కూలి డబ్బులకు అదనంగా ఫిబ్రవరిలో 20శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌, మే నెలలో 30 శాతం చెల్లిస్తారు. మంచినీటి డబ్బులు కూడా అదనపు భత్యంలోనే కలిపారు. మండలంలో రోజువారీగా పరిశీలిస్తే 6 వేల మంది కూలీల వరకు పనులకు వస్తుంటారు.ప్రస్తుతం 2వేల మంది పనికి వస్తున్నారు.గరిష్ఠ కూలీ రూ.205 ఉండగా సరాసరి రూ.134 గిట్టుబాటు అవుతోంది.గతంలో మాదిరి పనికి వెళ్తే పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా సరే పనికి వచ్చారంటే కచ్చితంగా పనిచేయాల్సిందే. 

ఉపాధి కోసం కూలీలు

చేసిన పని ఆధారంగానే కొలతలు వేసి కూలి డబ్బులు చెల్లిస్తారు. మరోవైపు ఉపాధి హామీలో కొనసాగుతున్న నర్సరీలోనూ కూలీలకు పని కల్పిస్తున్నారు. వర్షాలుపడే నాటికి మొక్కలు అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. భూగర్భజలాలు అడుగంటి పోతుండటంతో నీళ్లు ఇంకే పనులకే ప్రాధాన్యమిస్తూ ఉపాధిహామీ అధికారులు ముందుకు సాగుతున్నారు.మండలంలో నర్సరీలను 18 ఉపాధిహామీ కింద ఏర్పాటు చేశారు. వన సేవకుడు, నీళ్లు పోయటానికి, కవర్లు నింపడానికి వంటి పనులకు ఉపాధిహామీ కిందనే కూలీలను ఏర్పాటు చేసి కూలి డబ్బులను చెల్లిస్తున్నారు. ముథోల్‌, బాసర మండలాల్లో 29 పంచాయతీలుండగా 12 లక్షల మొక్కలను పెంచుతున్నారు.వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటి పోవటంతో వరదనీళ్లు భూమిలోకి ఇంకే పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పత్తి కుంటలు, నీటి కుంటలు, ఊట కుంటలు, కందకాలు, చెరువు పూడికలు వంటి పనులను చేపడుతున్నారు.

No comments:

Post a Comment