Breaking News

13/03/2019

తనయుడి పోటీ కోసం తల్లి సీటు త్యాగం

పోటీ నుంచి తప్పుకున్న మంత్రి పరిటాల సునీత
అమరావతి, మార్చ్ 13 (way2newstv.in)  
రాప్తాడు నియోజకవర్గం నుంచి తను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా అనూహ్య ప్రకటన చేశారు మంత్రి పరిటాల సునీత. అయితే ఈ సీటును ఆమె ఎవరి కోసమో త్యాగం చేయడం లేదు - తనయుడి పోటీ కోసం ఆమె ఈ సీటు త్యాగం చేస్తున్నట్టుగా ప్రకటించారు. పెద్ద కుమారుడు శ్రీరామ్ ను ఈ ఎన్నికల్లో పోటీ చేయించాలని సునీత భావిస్తూ ఉన్నారు. అందు కోసం చంద్రబాబు వద్ద టికెట్ కోసం గట్టిగా పోరాడుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాప్తాడు నుంచి శ్రీరామ్ పోటీ చేయబోతున్నట్టుగా ఆమె ప్రకటించారు.తాము చంద్రబాబును మొత్తం రెండు టికెట్లను కోరినట్టుగా - ఆ రెండు టికెట్లూ దక్కుతాయని అనుకుంటున్నట్టుగా - ఒకవేళ ఒకే టికెట్ దక్కే పక్షంలో.. అది రాప్తాడు మాత్రమే  అయితే అప్పుడు తను పోటీ నుంచి తప్పుకుని.. తన తనయుడిని అక్కడ నుంచి పోటీ చేయించాలని పరిటాల సునీత అనుకుంటున్నారట. 


తనయుడి పోటీ కోసం తల్లి సీటు త్యాగం

ఈ మేరకు ఆమె ఒక ప్రకటన చేశారు.పరిటాల సునీత తన తనయుడు శ్రీరామ్ ను అనంతపురం జిల్లా నుంచి ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నారు. అందు కోసం.. అనంతపురం అర్బన్ -పెనుకొండ - హిందూపురం ఎంపీ - కల్యాణ దుర్గం - ధర్మవరం తదితర నియోజకవర్గాలను అడుగుతూ ఉన్నారు. అయితే.. వాటన్నింటిలోనూ తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ లు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో .. ఆమె ఇప్పుడు చివరగా కల్యాణ దుర్గం నియోజకవర్గంను టార్గెట్ గా పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి.అక్కడ నుంచి టీడీపీ సిట్టింగు హనుమంతరాయ చౌదరిని మార్చాలనే ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు. అందుకే ఆ సీటు విషయంలో సునీత గట్టిగా పట్టుపట్టారని సమాచారం. ఇలాంటి నేపథ్యంలో.. ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయని ఒకవేళ కల్యాణ దుర్గం వారి కుటుంబానికి దక్కితే.. అక్కడ నుంచి శ్రీరామ్ ను పోటీ చేయించాలని సునీత అనుకుంటున్నారట.  అది దక్కకపోతే రాప్తాడు బరి నుంచి తను తప్పుకుని తన కుమారుడు శ్రీరామ్ ను పోటీ  చేయించనున్నారట ఆమె! అభిమానుల కోరిక మేరకే ఈ ప్రకటన చేస్తున్నట్టుగా సునీత పేర్కొన్నారు!

No comments:

Post a Comment