Breaking News

02/03/2019

50 రోజులు పూర్తి చేసుకున్న ఎఫ్ 2

హైద్రాబాద్,  మార్చి 2 (way2newstv.in
ఈరోజుల్లో ఓ సినిమా 50 రోజులు పూర్తిచేసుకోవడం చాలా కష్టమైపోతోంది. ఒక వేళ పూర్తిచేసుకున్నా మహా అయితే ఓ 50 నుంచి 60 సెంటర్లలో పూర్తవుతుంది. కానీ ‘ఎఫ్ 2’ విషయంలో ఆ లెక్కలు మారాయి. చాలా కాలం తరవాత ఎక్కువ సెంటర్లలో ఓ తెలుగు చిత్రం 50 రోజులు పూర్తిచేసుకుంది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్ 2’ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. 


50 రోజులు పూర్తి చేసుకున్న ఎఫ్ 2

అంతేకాదు వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డులకెక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా.. వరుణ్‌కు సరసన మెహ్రీన్ నటించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీతో ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. ‘ఎఫ్ 2’ చిత్రం 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొత్త పోస్టర్లను విడుదల చేసింది. ఈ పోస్టర్లపై 106 కేంద్రాల్లో ‘ఎఫ్ 2’ 50 రోజులు పూర్తిచేసుకున్నట్లు ముద్రించింది. 

No comments:

Post a Comment