డా.రాజశేఖర్ హీరోగా సి.కల్యాణ్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్, హ్యపీ మూవీస్ పతాకాలపై కన్మణి దర్శకత్వంలో కాంత కావూరి నిర్మిస్తున్న చిత్రం `అర్జున`. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. మార్చి 15న సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.
డా.రాజశేఖర్ `అర్జున` సెన్సార్ పూర్తి.. మార్చి 15న విడుదల
రాజశేఖర్ సరసన మర్యం జకారియా, సాక్షి గులాటి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీత సారథ్యం వహించగా మధు నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
డా.రాజశేఖర్, మర్యం జకారియా, సాక్షి గులాటి, కోట శ్రీనివాసరావు, రేఖ, సనా, మురళీ శర్మ, ఆనంద్, ప్రభాకర్ , బెనర్జీ, చలపతి రావు, వేణుమాధవ్, బాబు మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫైట్స్: కనల్ కణ్ణన్, సినిమాటోగ్రఫీ: మధు ఎ.నాయుడు, ఎడిటర్: గౌతంరాజు, మ్యూజిక్: వందేమాతరం శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి.మహేష్ చౌదరి, నిర్మాత: కాంత కావూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కన్మణి.
No comments:
Post a Comment