Breaking News

07/03/2019

తెలంగాణ వైపే దేశం చూపు

వరంగల్, మార్చ్ 7 (way2newstv.in)   
యావత్తు దేశం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారు.  పరిపాలన దక్షత కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్.  కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు.. దేశానికి దిక్సూచిగా నిలబడ్డాయని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం వరంగల్ లో జరిగిన పార్టీ సన్నాహక సభలో అయన మాట్లాడారు. 70 ఎండ్లలో రైతులను పట్టించుకోని నాటి పాలకులు.. నేడు కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాన్ని.. దేశం, రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.  పెన్షన్లతో కేసీఆర్ నా పెద్దకొడుకంటూ.. పెద్దమ్మలు దీవిస్తుంటే గర్వంగా ఉంది.  వరంగల్ లో అజంజాహి మిల్లును గత పాలకులు కనుమరుగు చేస్తే.. అదే వరంగల్ లో దేశంలోనే అతిపెద్ద టెక్ట్స్ టైల్ పార్క్ ను నిర్మించి ఉపాధి కల్పించబోతుంది టిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు.  


తెలంగాణ వైపే దేశం చూపు

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భతం.. త్వరలోనే రెండు కాదు, మూడు పంటలు పండించుకునే రోజులు వరంగల్ జిల్లా ప్రజలకు త్వరలోనే రాబోతున్నాయి.  మన మిషన్ భగీరథ పథకం దేశంలో 11 రాష్ట్రాలు చేపట్టబోతున్నాయి.  పార్లమెంట్ ఎన్నికలు మోదీ, రాహుల్ కు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు.  సోలా (16)కు, సోలా పార్లమెంట్ స్థానాలు గెలువాలి. కేంద్రం నుంచి మన పథకాలకు నిధులు, మన ప్రాజెక్టులకు హోదాలు.  మోడీ గ్రాఫ్ పడిపోతుంది.. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఆదరణ కరువైంది.  దేశంలో బిజేపి, కాంగ్రెస్ పార్టీలు రెండు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని అయన అన్నారు.  భావసారూప్యత కలిగిన పార్టీలు ఎకమై.. కేసీఆర్ నేతృత్వంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది.  నాడు రెండు ఎమ్పీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.. 16 ఎమ్పీలు గెలిపిస్తే నిధుల వరదలు తెలంగాణకు పారుతాయని కేటీఆర్ అన్నారు..

No comments:

Post a Comment