Breaking News

05/02/2019

సిటీ నుంచి యదేఛ్చగా కుళ్లిన మాంసం

రంగారెడ్డి, ఫిబ్రవరి 5, (way2newstv.in)
హైద్రాబాద్ నగరం, చుట్టు పక్క ప్రాంతాల్లోని మాంసాహారుల ఆరోగ్యం గాలిలో   దీపంలా తయారైంది.  అక్రమ వధశాలల నుంచి మార్కెట్లోకి వస్తున్న  దృవీకరించని మాంసం మార్కెట్ లో యధేచ్చగా చలామణి అవుతుండటంతో మాంసాహార ప్రియులు  ఆందోళన చెందుతున్నారు.నిబంధనలు  జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం నగర ప్రజలకు ఆరోగ్యకరమైన మాంసం అందే విదంగా చర్యలు తీసుకోవాలి. సర్కిల్ వారీగా ఉన్న పశువైద్యులు కబేళాలకు వస్తున్న గొర్రెలు, మేకలు, ఎద్దులను అన్నివిధాలా పరిశీలించాలి. ఏదైనా జబ్బులున్నట్లు తేలితే వాటి నుంచి మాంసం సేకరించకుండా చర్యలు తీసుకోవాలిఆరోగ్యంగా ఉన్నట్లు తేలిన  తరువాతే కబేళాలో మాంసం తయారీకి అనుమతించాలి. ఈ ప్రక్రియ ప్రకారం ఉత్పత్తి చేసిన మాంసానికి స్టాంప్ వేసిన తరువాతే మార్కెట్ కు తరలించాలి. దీన్ని స్టాంప్‌డ్ మాంసం గా పేర్కొంటారు. 
 సిటీ నుంచి యదేఛ్చగా కుళ్లిన మాంసం

కాని చాలావరకు మార్కెట్లో స్టాంపు లేకుండానే మాంసాన్ని విక్రయిస్తున్నారు. గతంలో గ్రేటర్ ప్రజలు ఈ స్టాంపును చూసి మాంసం నాణ్యతను సులబంగా గుర్తించేందుకు వీలుండేది.కాని ఇటీవల ఈ విధానం సక్రమంగా అమలు కాకపోతుండటంతో ఏది అరోగ్యకరమైందో, ఏది అనారోగ్యకరమైందో వినియోగదారులు తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాని ఈ  ప్రక్రియ మొత్తం ఓ ప్రహసనంలా తయారు కావటంతో నగర ప్రజలకు ఆరోగ్యకరమైన మాంసం అందటంలేదనే ఆరోణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో మాంస ప్రియులు మాంసాహానికి దూరం అవుతున్నారు.ప్రోటీన్లు ఎక్కువగా అవసరమైన వారికి మాంసాహారం అలవాటు ఉన్నవారికి మాంసాన్ని తీసుకోవాలని సూచించటం జరుగుతుంది. పిల్లల ఎదుగుదలకోసం మాంసాహారాన్ని అందించడానికి  తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుంటారు. క్రీడాకారులు, ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు, కార్మికులు, కర్షకులు, కూలీలు వారంలో ఒకసారి తప్పనిసరిగా మాంసాహారం తీసుకుంటారు.వీరందరికి ఆరోగ్యకరమైన మాంసం అందేవిదంగా చూడటం జీహెచ్‌ఎంసీ బాధ్యత. దాంతో దీని పరిదిలో కబేళాలు ఉంటాయి. ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందించే క్రమంలో జీహెచ్‌సీకి సైతం వివిధ రూపాల్లో ఆదాయం వస్తుంది. మాంసం తీసి అమ్మేవారికి జీవనోపాధిగా ఉంటుంది. దాంతో ఏటా ఈ రంగంలో కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి.కాని వాటిపైన నియంత్రణ మాత్రం సరైన రీతిలో లేకపోవటంతో దళారుల రాజ్యంగా తయారైంది. ఈ రంగం ఇంతగా వృద్ధి చెందటానికి,   ప్రోటీన్లు మాంసంలో సమృద్దిగా ఉండటమే కారణం. కాని ఇప్పుడున్న పరిస్థితిలో ఈ నిబంధన పాటించాలనుకునేవారు సైతం వెనకడుగువ వేసే పరిస్థితి. నగరంలో నాణ్యమైన మాంసం దొరకక పోవడంతో  గతంలో వారానికి ఒకటి, రెండు సార్లు మాంసాహారం తీసుకునే వారు క్రమంగా నెలకోసారి నామమాత్రంగా తీసుకునే పరిస్థితి వస్తోందని  నగర ప్రజలు ఆరోపిస్తున్నారు.జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం నగర ప్రజలకు ఆరోగ్యకరమైన మాంసం అందించేందుకు పశు వైద్యులతో ప్రత్యేక విబాగాన్నే ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో కేంద్ర స్థాయిలో డైరెక్టర్  పర్యవేక్షణ ఉంటుంది. క్షేత్రస్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. వీరు నగర వధశాలల వద్ధకు వచ్చే మేకలు, గొర్రెలు, గొడ్లు, చికెన్ సెంటర్లలోని కోళ్లను,చేపలను పరిశీలించి, అవి  ఎలాంటి జబ్బులతో లేకుండా ఆరోగ్యకరమైన స్దితిలో ఉన్నాయా లేవా అనే విషయాన్ని దృవీకరించాలి. వాటిని వదించి మాంసం తీసే పరిసరాల్లో పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.  ఆ తరువాతే వాటి వధించి మాంసాన్ని మార్కెట్లకు తరలించాలి. వీటికోసం నగరంలో గతంలో జియాగూడ, అంబర్ పేట, బోయిగూడ, గౌలిపురా, రాంనాస్ పురా ప్రాంతాల్లో ప్రభుత్వ జంతు వధశాలలు ఏర్పాటయ్యాయి. కాగా అవి శిధిలావస్థకు చేరుకొని కాలుష్య పూరితంగా మారటంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు ప్రభుత్వం చర్లపల్లిలో ప్రవేటు బాగస్వామ్యంతో ఆధునిక వధశాలను  నిర్మించింది. కాగా ఇది నగరంలోని వధశాలల కార్మికులకు, వ్యాపారులు, దుకాణాదారులకు దూరంగా ఉండటంతో ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. వారి జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని పాత వధశాలల స్థానంలో ఆధునిక వధశాలలను నిర్మించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఐదు పాత వధశాలల స్థానంలో ఆధునిక స్లాటర్ హౌస్ లు నిర్మించ తలపెట్టినా వాటిలో రూ.69 కోట్లతో బోయిగూడ, అంబర్ పేట, రామ్‌నాస్ పురాలో మాత్రమే పూర్తికాగా మిగతా చోట్ల పనులు నత్తన నడకన సాగుతున్నాయి. మరోవైపు ఇదే అదనుగా ప్రైవేటు స్లాటర్ హౌస్ లు పుట్టగొడుగుల్లా వెలిశాయి.అక్రమంగా జంతువులను వధించి మాంసాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటుండటంతో ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకం అవుతోంది. అంతేగాక నగరపాలక సంస్థకు ఫీజుల రూపంలో రావాల్సిన ఆధాయానికి సైతం  గండిపడుతోంది. ఇంత జరుగుతున్నా సంభంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్ల వ్యవహరించటం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్లు తీసుకొని నామమాత్రంగా దాడులు జరిపి, జరిమానాలతో సరిపెడతున్నారని బాహాటంగా ప్రజలు ఆరోపిస్తున్నారు.   

No comments:

Post a Comment