Breaking News

25/02/2019

‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ కన్ఫామ్

హైద్రాబాద్, ఫిబ్రవరి 25, (way2newstv.in)
నేచురల్ స్టార్ నాని 24 మూవీ చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ కన్ఫామ్ చేస్తూ టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నాని బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీకి ‘గ్యాంగ్ లీడర్’ అనే క్యాచీ టైటిల్ పెట్టారు. ఇందులో గ్యాంగ్ లీడర్ అంటే మెగాస్టార్ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ టైపు కాదు. 



‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ కన్ఫామ్

నేచురల్ స్టార్‌ది సెపరేట్ గ్యాంగ్.. అదే ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్.. ఆ గ్యాంగ్‌కి ‘గ్యాంగ్ లీడర్’ అన్నమాట నాని. నాని గ్యాంగ్‌‌లో ఎవరెవరు ఉండబోతున్నారంటే.. ‘ఓ చిన్న పాప.. కూతురు వయస్సు ఎనిమిదేళ్లు ఉంటాయి. ఓ టీనేజ్ అమ్మాయి.. చెల్లెల వయసు 17 ఏళ్లు. మూడో అమ్మాయికి 22 ఏళ్లు కత్తిలా ఉంటుంది. నాలుగో అమ్మాయి.. అమ్మాయి కాదు అమ్మ.. చూడగానే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఆమెకు ఒక యాభై ఏళ్లు ఉంటాయి. చివరకు ఒక నానమ్మ.. ముసలామె కాటికి కాళ్లు చాపేసింది. దేవుడి కాల్ కోసం వెయిటింగ్ ఆమెకు ఒక 80 ఏళ్లు ఉంటాయి. టోటల్‌గా వీళ్ల లైఫ్, ఏజ్ చూస్తుంటే.. పుట్టుక నుండి చావు వరకూ ఉండే లైఫ్ సైకిల్‌లా అనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే.. ఈ ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్ వెనకాల ఒకడు ఉన్నాడు సార్.. ఐదువేళ్లకి సపోర్ట్ ఇచ్చే అరచేతిలా.. పంచపాండవులకు శ్రీక్రిష్ణుడులా ఒక్కమాటలో చెప్పాలంటే వాడెవడో ఈ టీజర్ చూస్తే మీకే అర్ధమైపోతుంది. 

No comments:

Post a Comment