Breaking News

06/02/2019

కార్పొరేషన్ లో అక్రమాల హోర్డింగ్స్

 హైద్రాబాద్, ఫిబ్రవరి 6, (way2newstv.in)
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థలో  అడ్వర్టైజ్ మెంట్  విభాగం అతీగతీ లేకుండా తయారైంది. కోట్ల రూపాయల ఆధాయం వచ్చే డిపార్ట్ మెంట్ ను పట్టించుకునే వారే కరువయ్యారు.ఈ  విభాగాన్ని మూడు ముక్కలు చేసి పరిపాలించిన అధికారులు, ఇప్పుడు మాత్రం ఎవరు అటువైపు కన్నేత్తి చేడడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆదాయవనరుగా ఉన్న హెచ్‌ఎండీఏలోని అడ్వర్టుజ్‌మెంట్   విభాగం ఆలనా పాలనా లేక ఆగమైపోయింది. ప్రతియేటా కోట్ల రూపాయలు వచ్చే అవకాశమున్నా  వసూల్ చేసేవారే కరువయ్యారు. ఇదే అదునుగా చేసుకొని  ఏజెన్సీలు, సంస్థ ఖజానాకు గండికొడుతున్నారు. హెచ్‌ఎండీఏ అంటేనే వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులు, అంతేకాదు లేఅవుట్ల పర్మిషన్లు, నిర్మాణాల అనుమతులు, భూసేకరణలు, ప్లాట్ల వేలం ఇలా ప్రతియేటా వివిధ మార్గాల ద్వారా వేల కోట్ల రూపా యలను గడిస్తోంది. కానీ కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చే అడ్వర్టుజ్‌మెంట్   విభాగం మాత్రం కొన్నేళ్లుగా ఆగమైపోయింది.


కార్పొరేషన్ లో అక్రమాల హోర్డింగ్స్ 

మొన్నటి వరకు పబ్లిసిటీ విభాగాన్ని మూడు ముక్కలు చేసి చూసేవారు అధికారులు. అందులో అర్బన్ ఫారెస్ట్ వింగ్, బుద్దపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ), రిసర్చ్ అండ్ డెవలప్ మెంట్  విభాగాలకు చెందిన అధికారులు ఏరియాలుగా పంచుకొని పనిచేసేవారు. అయిన హెచ్‌ఎం డీఏకు మాత్రం ఒక్కరూపాయి కూడా వసూల్ చేసిన సందర్భాలు లేవు.ఏవరికి వారే యమున తీరే అన్నట్లు ఏజెన్సీలతో చేతులు కలిపి దండుకున్నారు.  ఫలితంగా 2010 నుండి హెచ్‌ఎండీఏకు 30 కోట్లకు పైగా ఏజెన్సీలు బకాయిలు పడ్డాయి. అయిన ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏకు మాత్రం ఒక్క రూపాయి కూడా వసూల్ చేయడం లేదు.హెచ్‌ఎండీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సిటీలో విచ్చల విడిగా అక్రమ హోర్డింగ్ లు వెలుస్తున్నాయి. అంతేకాదు యాడ్ ఏజెన్సీల టెండర్ గడువు ముగిసిన పట్టించుకునే వారే లేకపోవడంతో.. ఇంకా కొనసాగుతునే వున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలో 20 వరకు ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని ఏజెన్సీలు కోట్లల్లో బకాయిలు చెల్లించాల్సి వుంది. బకాయిలు చెల్లించకుండానే హోర్డింగ్ లు పెట్టుకొని బిజినెస్ కొనసాగిస్తున్నాయి. హెచ్‌ఎండీఏకు చెందిన లుంబిని పార్క్, ఎన్టీఆర్ పార్క్, సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్ మార్గాల్లో కుప్పలు కుప్పలుగా లాలీ పప్స్, డస్ట్ బిన్ పోల్స్ వేలిశాయి. ఇవేకాకుండా పీవీఎన్‌ఆర్ ఎక్స్ ప్రెస్ హైవే కింద పిల్లర్లకు కూడా హోర్డింగ్ లు పెట్టి దండుకుంటున్నారు.హెచ్‌ఎండీఏ నుండి ఎలాంటి అనుమతి లేకుండానే ఓ సంస్థ  కోటి రూపాయలు ఇన్వేస్ట్ చేసి.. వందల సంఖ్యలో పిల్లర్లకు రెండు వైపుల హోర్డింగ్స్ పెట్టేసింది. అయిన పట్టించుకునే వారే కరువయ్యారు. అలాగే శిల్పారామం, హైటెక్ సిటీ ఏరియాల్లో సైతం టూ సైడ్, త్రిసైడ్ హోర్డింగ్ లు వున్నాయి. 2016 లో కేబీఆర్ పార్క్ వద్ద వున్న యూనిక్ పోల్, భారీ హోర్డింగ్ లను జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. ఇకనైనా ప్రభుత్వంఈ పరిస్దితిని చక్కదిద్దాలి

No comments:

Post a Comment