Breaking News

06/02/2019

మెట్రో మూడో దశకు అంతా సిద్ధం

హైద్రాబాద్,  ఫిబ్రవరి 6, ( way2newstv.in)
మెట్రో రైలు సర్వీసుల్లో 3 వ దశ ప్రారంభం కానుంది. జంట నగరాల ప్రజలు ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ మెట్రో సర్వీసులను  ఈ నెల 15తేదిన ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  రెండు నెలలుగా అమీర్‌పేట - మార్గంలో ట్రయల్ రన్స్ విజయవంతం కావడంతో తుది అనుమతి కోసం కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్)ని మెట్రో అధికారులు సంప్రదించినట్లు సమాచారం.



మెట్రో మూడో దశకు అంతా సిద్ధం

హైదరాబాద్ మెట్రో రైళ్ల నిర్వహణలో ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక టెక్నాలజీ అయిన కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ (సీబీటీసీ)ని వినియోగిస్తుండడంతో దీనికి సంబంధించిన రెండు సంస్థల నుంచి భద్రతా పరంగా సంతృప్తి వ్యక్తం చేయడంతో తుది పరీక్షగా కేంద్ర రైల్వే శాఖ నుంచి సీఎంఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ మార్గంలో పరిశీలన చేస్తోంది. ఇది పూర్తి కావడానికి మరో వారం పడుతుందని, తర్వాత ప్రారంభోత్సవం తేదీ, ముహూర్తాన్ని ప్రభుత్వమే ఖరారు చేస్తుందని తెలిసింది.  15వ తేదీలోగా అన్ని పరీక్షలు, అనుమతులు వచ్చే అవకాశం ఉందని కాబట్టి  ఫిబ్రవరి 15 న  మెట్రో ప్రారంభించే అవకాశం ఉంది

No comments:

Post a Comment