Breaking News

09/02/2019

లాయర్ అనిల్ కు వైద్య చికిత్య అందించాలి

అమరావతి, ఫిబ్రవరి 9 (way2newstv.in)  
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ అనుసరిస్తున్న వైఖరితో మనస్తాపం చెంది నంద్యాలకు చెందిన న్యాయవాది అనిల్ కుమార్ సాగర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ఈ మేరకు  అనిల్ కుమార్ సాగర్కు అవసరమైన వైద్య సహాయం అందించాలని కర్నూలు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసారు. అనిల్ కుమార్ సాగర్ను కలిసి అతనికి అందుతున్న వైద్యచికిత్సను దగ్గరుండి పర్యవేక్షించాలని, అతని కుటుంబానికి ధైర్యం చెప్పాలని జిల్లా కలెక్టరు, ఎస్పీలకు సూచించారు.


లాయర్ అనిల్ కు వైద్య చికిత్య అందించాలి

ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలెవ్వరూ ధైర్యం కోల్పోరాదు, సంయమనం పాటించి సమైక్యంగా పోరాడి న్యాయబద్దమైన హక్కుల్ని సాధించుకుందాంమని అయన అన్నారు.  ఆత్మహత్యలకు పాల్పడితే జరిగే నష్టం వ్యక్తిగతంగా కుటుంబాలకే తప్ప కేంద్రానికి ఏమీ కాదు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలన్నీ నెరవేర్చుకుందాం. దేశంలో అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై సంఘటితంగా పోరాడే ప్రయత్నం చేస్తున్నామని అయన అన్నారు. ఎవరూ సంయమనం కోల్పోవద్దు, ఆవేశకావేషాలకు లోనుకావద్దు, శాంతియుత పంథాలో మన హక్కుల్ని సాధించుకుందాం. ఢిల్లీలో జరిగే ధర్మపోరాట దీక్షలో తెలుగువాడి సత్తా ఏమిటో నియంతృత్వ ప్రభుత్వానికి చాటుదామని చంద్రబాబు అన్నారు. 

No comments:

Post a Comment