Breaking News

19/02/2019

ప్రకృతికి జై (కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, ఫిబ్రవరి 19 (way2newstv.in):
రాష్ట్రంలోనే జిల్లా ప్రత్యేకత చాటుకుంటోంది. తొలుత బందరు, నాగాయలంక, నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, చాట్రాయి, రెడ్డిగూడెం తదితర మండలాల్లో పది క్లస్టర్లు కేటాయించి ఒక్కో క్లస్టర్‌కు 5 గ్రామాల చొప్పున తొలి ఏడాది 7,600 హెక్టార్ల వరకు ప్రకృతి విధానంలో సాగు చేపట్టారు. తదుపరి 2017 ఖరీఫ్‌లో మరో 15 క్లస్టర్లలో సాగు పెంచారు. వత్సవాయి, వీరులపాడు, మైలవరం, తిరువూరు, ఉంగుటూరు, గుడివాడ, గూడూరు, మొవ్వ, పామర్రు, పెదపారుపూడి, బంటుమిల్లి, మండవల్లి, పెనమలూరు మండలాలతో కలిపి మొత్తం 25 క్లస్టర్లలో 80పైగా గ్రామాల్లో వేలాది మంది రైతులతో 20 వేల హెక్టార్లకుపైగా సాగు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. 2018 ఖరీఫ్‌లో అది 24 వేల హెక్టార్లకు చేరింది.


 ప్రకృతికి జై (కృష్ణాజిల్లా)

రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది రైతులను ప్రకృతి సాగులో మమేకం చేయాలని ప్రభుత్వం నిర్దేశించగా, జిల్లాలో లక్ష మందితో ఈ సాగు చేయించాలని అధికారులు నిర్ణయించారు. రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు అందించడంతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందేలా క్లస్టర్‌ రిసోర్సు పర్సన్లను, మండలాల వారీగా సీఆర్పీలను నియమించారు. ప్రకృతి సాగు విధానం, విత్తనశుద్ధి, దేశీయ విత్తన వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతిసాగు చేస్తున్న రైతుల ద్వారా ఇతర రైతులను ప్రోత్సహించేందుకు ఐసీఆర్పీలను నియమించారు. వారి గ్రామాల్లో పనిచేస్తే నెలకు రూ.5 వేలు, పక్క గ్రామాల్లోనైతే రూ.8 వేలు, పక్క మండలాల్లో పనిచేస్తే రూ.10,000 చొప్పున వేతనం అందిస్తున్నారు.
పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వినియోగించరు. కేవలం జీవామృతం, బీజామృతం వంటి కషాయాలను మాత్రమే వాడతారు. వీటి తయారీపై  రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించడంతోపాటు విక్రయ దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దుకాణం ఏర్పాటు చేసుకునే రైతుకు 50 శాతం రాయితీ కల్పిస్తోంది.

No comments:

Post a Comment