Breaking News

16/02/2019

గులాబీ పార్టీ స్టాండ్ మార్చుకుందా...

హైద్రాబాద్, ఫిబ్రవరి 16, (way2newstv.in
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీచేశారని, దానికి బదులుగా తాను కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టి బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని పేర్కొంటూ కేసీఆర్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఇ టీవల కేసీఆర్ తనయుడు కేటీఆర్.. ఏపీకి వెళ్లి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశమవటంతో రిటర్న్ గిఫ్ట్ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయింది. కేసీఆర్ అన్నంత పని చేసేందుకు పూనుకున్నాడుగా! అని రకరకాలుగా చర్చలకు తెర లేపారు ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలు. బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే నేపథ్యంలో కేసీఆర్ తప్పటడుగు వేస్తున్నారని పేర్కొన్న వారు కూడా లేకపోలేదు. 


 గులాబీ పార్టీ స్టాండ్ మార్చుకుందా... 

అయితే తాజాగా టీఆర్ఎస్ నాయకుడు ఒకరు మాట్లాడిన మాటలను బట్టి బాబు రిటర్న్ గిఫ్ట్ విషయంలో కేసీఆర్ యూ టర్న్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడైన కరీంనగర్ ఎంపీ వినోద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ హాట్ చర్చలకు దారితీస్తున్నాయి. మీడియా సంస్థతో ముచ్చటించిన ఎంపీ వినోద్ కుమార్.. మరికొద్ది రోజుల్లో ఏపీలో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీఆర్ఎస్ మద్దతు అవసరం లేదని పేర్కొనటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు, నాయకుల బలం అస్సలే లేదని తెలుపుతూ కనీసం టీఆర్ఎస్ కార్యాలయం కూడా లేని ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ వేలు పెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజేకీయ పరిస్థితులను బట్టి తాము మద్దతు ఇచ్చినా వైసీపీకి పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆయన పేర్కొనటం ప్రజల్లో పలు అనుమానాలకు తెరలేపుతోంది.ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న విషయాన్నికూడా ప్రస్తావించిన వినోద్.. సీఎం కేసీఆర్ బాబుకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ అందిస్తాడని వినోద్ స్పష్టం చేశారు. కానీ ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టమని చెప్పుకొచ్చారు. దీంతో రాజకీయాల్లో వేలు పెట్టకుండా రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు బాబును ఓడించేందుకు సీరియస్ గా ప్రయత్నాలు చేసి ఇప్పుడు టీఆర్ఎస్ తన స్టాండ్‌ను మార్చుకున్నట్టు వినోద్ మాటలను బట్టి అర్థమవుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి చివరకు కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండనుందో..!

No comments:

Post a Comment