Breaking News

27/02/2019

ప్రభుత్వ ఆసుపత్రి , అభివృద్ధి పై సమీక్ష

సిద్ధిపేట, ఫిబ్రవరి 27: (way2newstv.in
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మెడికల్ కళాశాలలో బుధవారం ఉదయం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశం, ఆసుపత్రుల అభివృద్ధి సోసైటీ కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధ్యక్షతన మెడికల్ కళాశాల ప్రినిపల్ తమిళ్ అరసు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరై సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాల అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయమై సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మెడికల్ కళాశాల  డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కమిటీ సభ్యులు ఆసుపత్రిలో 15 అంశాలతో కూడిన ఏజెండా వివరించారు. ఈ సమీక్షలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమిళ్ అరసు, ఆర్ఏంఓ, సూపరిండెంట్ చంద్రయ్య, డీఎంహెచ్ఓ అమర్ సింగ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



ప్రభుత్వ  ఆసుపత్రి , అభివృద్ధి  పై సమీక్ష 


వారం, 10 రోజులలో సిద్ధిపేట ఆసుపత్రిలో ఆప్తమాలజీ థియేటరు ఉండాలి.
 సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వారం, పది రోజులలో అప్తమాలజీ థియేటరును యుద్ధ ప్రాతిపదికన తెప్పించాలని,  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కంటి వెలుగులు కార్యక్రమంలో వేలాది సంఖ్యలో వస్తున్న క్రమంలో కంటి ఆపరేషన్లు పెండింగ్లో ఉన్నాయని., ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేలా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చొరవ చూపాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
 ఈ విషయం పై వైద్య ఆరోగ్య శాఖ ఏండీతో ఫోను లైనులో సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి యుద్ధ ప్రాతిపదికన అప్తమాలజీ థియేటరు బిగించాలని, కావల్సిన ప్రతిపాదనలు వైద్యాధికారులతో తీసుకోవాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు. దీంతో పాటు సిటీ స్కాను, ఎంఆర్ఐ మిషనరీలు సప్లయ్ విషయంలో చొరవ తీసుకుని ఏలాంటి అవసరం ఉన్నా తన దృష్టికి వైద్య అధికారులకు తేవాలని సూచనలు చేశారు.
 గజ్వేల్ లో కంటి వెలుగు ఆపరేషన్లు ప్రారంభించాలి.
సిద్ధిపేటలోని మైక్రోస్కోప్ లను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించి వెంటనే అక్కడి థియేటర్లలో వెంటనే కంటి వెలుగులు ఆపరేషన్లు ప్రారంభించాలని, అందుకు కావల్సిన చర్యలు చేపట్టాలని టీఎస్ఎండీఎస్ ఏండీతో ఫోన్ లైనులో ఆదేశించారు. కంటి శస్త్ర చికిత్సల ఆపరేషన్ థియేటర్ల నిర్మాణానికై సంబంధించిన అధికారిక వర్గాలు ప్రతిపాదనలు ఇవ్వడంతో పాటు పనులు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సిటీ స్కాను, తదితర పరికరాలను వెంటనే సమకూర్చాలని వైద్య అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

No comments:

Post a Comment