తిరుపతి,ఫిబ్రవరి 12 (way2newstv.in):
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్తవాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించారు.మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహించారు.
సప్తవాహనాలపై శ్రీ గోవిందరాజస్వామివారు
అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఏఈవో ఉదయభాస్కర్రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీహరి,టెంపుల్ ఇన్స్పెక్టర్శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment