Breaking News

12/02/2019

ఫిబ్రవరి 14న లవర్స్ డే ఖతర్నాక్ కామెడీ

హైద్రాబాద్, ఫిబ్రవరి 12  (way2newstv.in
అబ్బో.. బబర్దస్త్ కామెడీ షో రచ్చ మామూలుగా ఉండేట్టులేదుగా.. ఫిబ్రవరి 14న అదే లవర్స్ డే సందర్భంగా 300 స్పెషల్ పేరుతో అదిరిపోయే ఖతర్నాక్ కామెడీని అందించేందుకు రెడీ అయ్యారు. ఇటీవల ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని వదిలారు. ఇందులో మొగడూ పెళ్లాలుగా యాంకర్ అనసూయ, హైపర్ ఆదిలు స్టేజ్‌పై సరసాలు ఆడుతుంటే.. మేం ఏమైనా తక్కువా అంటూ రూమర్స్ కింగ్ లవర్స్ జోడి రష్మి, సుధీర్‌లు కూడా మొగుడూ పెళ్లాలుగా రొమాన్స్ పండించేస్తున్నారు. 


ఫిబ్రవరి 14న  లవర్స్ డే ఖతర్నాక్ కామెడీ

ఈ లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో.. హాట్ యాంకర్ అనసూయ ఎప్పటిలాగే చీరసొగసుల్ని ఎరగా వేస్తూ.. రౌడీ బేబీ అవతారంలో జబర్దస్త్ మొగుడు ఆదికి రెచ్చగొడుతోంది. ఇక ఎప్పుడెప్పుడు అనసూయకి మొగుడు క్యారెక్టర్ వస్తుందా ఆవురావురు మంటూ ఎదురుచూస్తున్న హైపర్ ఆది నోటితో పాటు మిగిలినవాటికి పనిచెప్తున్నాడు. ఇక ఏమే.. అంటూ అనసూయను ఆది పిలవడం దానికి కాస్త సీరియస్‌గా ఆదివైపు చూడటం.. ఆది తరువాత అనసూయ గారూ అంటే అనసూయ పొంగిపోవడం ఫన్నీగా ఉంది. ఇందులో మొగుడు పెళ్లాల రిలేషన్ ఎక్కడ ఏడ్చి చచ్చింది. అదే యాంకర్, టీం లీడర్ రిలేషన్. అంటూ ఆది నిరూత్సాహ పడటం.. అది కాదు ఆది అని అనసూయ గారం చేస్తూ ఏవండీ అని తెగ సిగ్గుపడిపోతూ హొయలొలికిస్తూ ఆది బుజంపై చేతులు వేసి.. ఏంటి ఆది అలా అయిపోయావ్ అంటే.. ‘జల్లికట్టు ఆటలో.. పెద్ద పెద్ద వాటిని కూడా లొంగదీసుకుంటాం.. కాని తాళికట్టు ఆటలో ఇలా చిన్న చిన్నవాటికి కూడా లొంగిపోతాం’ పంచ్ పేల్చేశాడు. ఇక ఆదిపక్కకు వచ్చిన నిలబడ్డ అనసూయని చూసి ‘ఏంటో పదంస్తుల మేడ దగ్గర పదో తరగతి పిల్లోడిలా ఉన్నా’ అంటూ ఆది హైప్ ఇచ్చే పంచ్ వదిలాడు. వీరి సరసాలు సాగుతుండగా.. ఆది తోడల్లుడు సుడిగాలి సుధీర్.. భార్య రష్మితో కలిసి సరసాలు చాలు చాలు శ్రీవారు సాంగ్‌కి స్టెప్పులు వేసుకుంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేశారు. ఇక రష్మి చీర సొగసులకు ఎప్పటిలాగే సొల్లు కార్చుకుంటూ గింగిరాలు తిరిగిపోతున్న సుడిగాలి సుధీర్‌ని చూసి.. ‘ఏంట్రా కుబుసం విడిచిన తాచు పాములా తెగ మెలికలు తిరుగుతున్నావ్’ అంటూ పంచ్ వేసేశాడు ఆది. ఇక సిస్టర్స్  ఇద్దరూ స్టేజ్‌పై సెల్ఫీల కార్యక్రమానికి తెరతీయగా.. మీరు మేకప్ వేస్తున్నారా ఇంటి పైకప్పు వేస్తున్నారా? మేకప్ కిట్ రెండురోజుల్లో అయిపోయింది అంటుంది నా పెళ్లం అనసూయ.. రెండు రోజుల్లో మేకప్ కిట్ అయిపోవడం ఏంటి రోజా గారూ.. అయినా మేకప్ గురించి మీతో ఎందుకు చెప్తున్నా.. మీది మధ్యాహ్నానికే అయిపోతుంది కదా’ అంటూ రోజాను సైతం వదల్లేదు ఆది. సుమారు ఆరున్నర నిమిషాలు పాటు సాగిని ఈ ఫన్ అండ్ ఫస్ట్రేషన్ ప్రోమో ఇప్పటికే 4.5 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేయడంతో ఈ మొగుడ్స్ పెళ్లమ్స్ లవర్స్ డే ప్రోమోలో ఫన్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాజా ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి

No comments:

Post a Comment