Breaking News

16/08/2018

డిసెంబర్ కల్లా ప్రజా సమస్యల పరిష్కారం

అమరావతి, ఆగస్టు 16 (way2newstv.in)
గ్రామ దర్శనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నోడల్ అధికారులు, కలెక్టర్లు, వివిధ శాఖల సిబ్బంది పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామదర్శని ప్రారంభమై నెల రోజులు అయ్యింది. ఇంకా  5 నెలలు మాత్రమే ఉంది. గురు, శుక్రవారాల్లో అధికారులు అందరూ గ్రామాలు సందర్శించాలి. డిసెంబర్ కల్లా ప్రజా సమస్యలన్నీ పరిష్కరించాలి. గ్రామాల్లో అందరి సహకారం తీసుకోవాలి ప్రజలతో పలకరింపు బాగుండాలని సూచించారు. వారి యోంగక్షేమాలు విచారించాలి. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవాలి. 2019-2014 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించాలని అన్నారు.



డిసెంబర్ కల్లా ప్రజా సమస్యల పరిష్కారం

 అన్ని శాఖల్లో అంతర్గత ప్రక్షాళన జరగాలి. 3 నెలల్లో ప్రతిఇంటికి డోర్ నెంబర్, ప్రతి వీథికి సెన్సార్స్ ఏర్పాటు చేయాలి. సిసి కెమెరాలు, డ్రోన్లతో పోలీసింగ్ పటిష్టం కావాలి. ఇప్పుడు 5వేల సీసి కెమెరాలు ఉన్నాయి. మరో 23వేల సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని అదేశించారు. ఈజ్ ఆప్ గెటింగ్ సిటిజన్ సర్వీసెస్ లో మనమే ముందుండాలి. పౌరులకు అన్నిరకాల సేవలు అందుబాటులోకి రావాలి. ప్రపంచంలో మోస్ట్ లివబుల్ స్టేట్ గా మన రాష్ట్రం రూపొందాలి.  నాణ్యంమైన విద్యుత్, నాణ్యమైన నీరు, 100% గ్యాస్ ఇస్తున్నాం.నాణ్యమైన జీవితం ప్రతిఒకరికీ అందుబాటులోకి తేవాలి. ప్రతిఒక్కరికి హెల్త్ రికార్డు రూపొందించాలి. ప్రతి గ్రామం పర్యాటక కేంద్రం కావాలి. గ్రామ పర్యాటకం పెంపొందాలి. కేంద్రప్రభుత్వం మన రాజధానికి రూ.1500కోట్లు మాత్రమే ఇచ్చింది. అదే బాండ్ల రూపంలో ఒక్కగంటలోనే రూ.2వేల కోట్లు వచ్చాయి. అదే రైతులు రూ.50వేల కోట్ల విలువైన భూములిచ్చారని అయన అన్నారు. మన పాలనపై ప్రజల్లోఉన్న నమ్మకానికి అదే నిదర్శనం. మన ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి అదే రుజువు. వర్షాలు బాగా పడుతున్నాయి.  రిజర్వాయర్లలోకి నీటి చేరిక పెరిగింది. శ్రీశైలానికి లక్షా 78వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని అయన అన్నారు. 

No comments:

Post a Comment