Breaking News

14/08/2018

తెలంగాణలో ఇవాళ్టి నుంచి కొత్త కార్యక్రమాలు

హైద్రాబాద్, ఆగస్టు 14 (way2newstv.in)
ప్రజారోగ్య సంరక్షణ లో ఇప్పటికే అమ్మఒడి, కేసీ ఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఇప్పుడు కంటి చూపునకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా దేశంలోనే ‘తెలంగాణ’ను దృష్టిలోపం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని చేపట్టా రు. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అనే సూక్తిని గుర్తించిన సీఎం ఇంటిల్లిపాదికి కంటివెలుగులు ప్రసరింప జేసేందుకు కంకణం కట్టుకున్నారు. ప్రజలందరికీ ఉచి తంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు  చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలో మధ్యాహ్నం 2 గంటలకు ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు.దాదాపు 3.70 కోట్ల మందికి ఉచి తంగా నేత్ర పరీక్షలు నిర్వహించి మందులు, కళ్లజోళ్లను అందిస్తారు. తెలంగాణలో ఇవాళ్టి నుంచి కొత్త కార్యక్రమాలు

ఇప్పటికే ఆటోరి ఫాక్టోమీటర్లు, కంటి అదా ్దలు, ఐఈసీ మెటిరీయల్ అన్ని జిల్లాలకు చేరుకున్నాయి. నేత్ర పరీక్షల నిర్వహణకోసం రాష్ట్ర వ్యాప్తంగా 799 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 114 కంటి ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు, 40లక్షల కళ్లజోళ్లను సిద్ధం చేశారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.52 కోట్లు వెచ్చిస్తోంది. గతంలో అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ పథకాన్ని విజయవంతం చేయడం లో కీలకపాత్ర పోషించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, కుటుంబ సంక్షేమశాఖ కమిష నర్ వాకాటి కరుణ మరో ప్రతిష్టాత్మకమైన ‘కంటి వెలు గు’ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. జిల్లా కలెక్టర్లతో తరచు వీరు వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలు నిర్వహించి ఈ కార్యక్రమం అమలులో లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకొన్నారు. రాష్ట్రంలోని ప్రతిపౌరునికి కంటి పరీక్షలు నిర్వహించా లన్న సర్కారు లక్ష్యానికి అనుగుణంగా కంటికి రెప్పలా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నేత్ర వైద్య శిబిరాల్లో పరీక్షలను ఐదం చెల విధానంలో నిర్వహిం చేందుకు ప్రణాళికలు రూపొం దించారు. మైక్రోయాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి గ్రామంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు. ప్రతి బృందంలో మెడికల్ ఆఫీసర్, ఆప్టిమెట్రిక్‌తోపాటు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. వీరంతా గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వ హించడమే కాకుండా నాణ్యమైన వైద్యసేవలను అందించి అవసర మైనవారికి కళ్లజోళ్లను ఉచితంగా అందజేస్తారు. శస్త్రచికిత్సలు అవసరమైనవారికి అన్ని వసతులు కలిగిన ఆస్పత్రికి పంపుతారు. గ్రామాల్లో నిర్వహించే నేత్ర వైద్య శిబిరంలో ఐదు టేబుళ్లను ఏర్పాటు చేసి ఒక్కోచోట ఏ విధంగా ప్రజలకు సేవలు అందించాలన్నదానిపై ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ తగిన సూచనలు చేసింది.తెలంగాణ సర్కారు ముందుచూపుతో రాష్ట్ర ప్రజల కంటి చూపును కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టి అంధత్వ రహిత తెలంగాణ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. కేవలం కార్నియా సమస్యతోనే కాకుం డా రెటీనా, గ్లకోమా, మధుమేహం తదితర సమస్యలతో కంటిచూపు కోల్పోతున్న వారికి వైద్యపరంగా అండగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ భావిస్తు న్నది. కంటి వెలుగు వైద్య శిబిరాల ద్వారా ప్రత్యేక వైద్య సేవలను అందించేందుకు రాష్ట్రంలో కొత్తగా 900 మంది వైద్యాధికారులను నియమించింది.  వీరికి తోడుగా ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవ సరమైన ఆష్టిమెట్రిక్స్‌ను  కూడా నియమించారు. అంతేగాక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప త్రులతోపాటు, స్వచ్ఛందసంస్థల ఆస్పత్రులను తీసు కున్నారు. పంద్రాగస్టు నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుండడంతో రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కలె క్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో  నిమగ్నమయ్యారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీ క్షలు నిర్వహించి, అవసరమైన వారికి కండ్లద్దాలు, మం దులు అందివ్వాలని, ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వ హించాలని,  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను అధికార యం త్రాంగం పూర్తిచేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు అన్ని జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశాలు నిర్వ హించి షెడ్యూల్ తయారుచేశారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమ నిర్వాహణను సమీక్షించి ప్రజలకు పూర్తిస్థాయి లో అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రజలంతా తప్ప కుండా కంటి వైద్య శిబిరాలకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఏ రోజు ఏ గ్రామంలో పరీక్షలు నిర్వహిస్తున్నా రనే విషయం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వి హంచి ప్రజలను కార్యోన్ముఖులను చేశారు.  తెలంగాణ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆగస్టు మాసంలోనే అనేక కొత్తపథకాలకు శ్రీకారం చుట్టడంతో రాష్ట్ర మంతటా పండుగ వాతావరణం నెలకొంది.

No comments:

Post a Comment