Breaking News

25/08/2018

పర్యాటకంలో తపాలా శాఖ భాగస్వామ్యం సంతోషకరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు

అమరావతి ఆగష్టు 25  (way2newstv.in)
;ఆంధ్రప్రదేశ్ పర్యాటక అందాలను తపాలా బిళ్లల రూపంలో తీసుకురావటం ముదావహమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు అన్నారు. ఈ ప్రక్రియ వల్ల రాష్ట్ర పర్యాటక ప్రాధాన్యతలు విశ్వవ్యాప్తం కానున్నాయన్నారు. తపాలా శాఖ అందిస్తున్న మై స్టాంప్ పధకాన్ని పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ సద్వినియోగం చేసుకుందని ప్రశంశించారు. శనివారం సచివాలయంలోని ముఖ్యమంత్రి సమావేశ మందిరంలో వీటిని ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్య నిర్వహణ అధికారి హిమాన్హు శుక్లా, ఎపి సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె.బాలసుబ్రమణ్యన్, విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ యెలిషా, తపాలా శాఖ ఉన్నతాధికారులు సంతోష్, విఎస్ఎల్ నరశింహారావు, సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 



పర్యాటకంలో తపాలా శాఖ భాగస్వామ్యం సంతోషకరం
        రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు

రాష్ట్ర పర్యటనలకు వచ్చే వివిధ దేశాల ప్రతినిధులు,  ప్రముఖులకు వీటిని బహుమతిగా అందించటం ద్వారా, అంతర్జాతీయ స్ధాయిలో  ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతాలు ప్రత్యేక ప్రచారాన్ని పొందగలుగుతాయని ఈ సందర్భంగా సిఎం అన్నారు. రాష్ట్ర పర్యాటకంలో తపాళా శాఖ భాగస్వామ్యం కావటం సంతోషకరమన్నారు.  వివిధ దేశాలలో జరిగే అంతర్జాతీయ స్ధాయి పర్యాటక ప్రదర్శనలలో వీటిని అందుబాటులో ఉంచటం ద్వారా ఆయా సదస్సులలో చర్చకు అవకాశం కలుగుతుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానం, శ్రీశైల  దేవస్ధానం,  కనకదుర్గమ్మ గుడి, అరకు గిరిజన ప్రదర్శనశాల,  గండికోట రాతిలోయ, విశాఖపట్నం - రామకృష్ణ బీచ్, చిత్తూరు-చంద్రగిరి కోట, అమరావతి-పవిత్రసంగమం , రాజమండ్రి-పాపికొండలు, అరకు-బొర్రాగుహలు, నెల్లూరు-పులికాట్ సరస్సు, అమరావతి-జ్ఞానబుద్దుడు ఇలా 12 ప్రాంతాల చిత్రాలతో తపాలా బిళ్లలను పర్యాటక శాఖ రూపొందించగా వాటిని సిఎం ఆవిష్కరించారు. ఈ నేపధ్యంలో తపాలా బిళ్లల ఆవశ్యకతను ముఖ్యమంత్రికి వివరించిన మీనా, పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేయించటం ద్వారా అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ పర్యాటక ప్రాంతాలు మరింతగా జన బాహుళ్యంలోకి వెళతాయన్నారు.  స్టాంపుల సేకరణ ప్రేమికులు వీటిని అపురూపంగా భద్రపరుచుకుంటారని, వారి ప్రదర్శనలలో సహజంగానే ఇవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వివరించారు. ఈ తపాళా బిళ్లలకు అనుసంధానంగా ఆంధ్రపదేశ్ ప్రభుత్వ రాజముద్ర, పర్యాటక శాఖ లోగో కూడా ఉండగా, ఇది చూపరుల ఆసక్తిని రాష్ట్రం వైపు మరల్చగలుగుతుంది.

No comments:

Post a Comment