Breaking News

10/08/2018

వైసీపీలో వర్గ పోరు

కాకినాడ, ఆగస్టు 10, (way2newstv.in)
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వైసీపీలో నెలకొన్న వర్గపోరుపై ఆ పార్టీ అధినేత జగన్ సీరియస్ అయినట్టు సమాచారం. నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు మురళీరాజు, పర్వతప్రసాద్ లను తన శిబిరం వద్దకు పిలిపించుకున్న జగన్... వారిద్దరికీ క్లాస్ పీకారు. కత్తిపూడి క్రాస్‌రోడ్డు నుంచి జరిగిన పాదయాత్రలో మురళీరాజు మేనల్లుడుపై పర్వత ప్రసాద్‌ చేయి చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వాకబు చేసిన జగన్‌  కాకినాడ పార్లమెంటరీ కన్వీనర్‌ కురసాల కన్నబాబు సమక్షంలో ఇరువర్గాలు విభేదాలు వీడి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించినట్లు తెలిసింది. మురళీరాజు ఏర్పాటు చేసిన ప్రచార బెలూన్‌లపై కో-ఆర్డినేటర్‌ ప్రసాద్‌ ఫొటో లేకపోవడంపై ఆయన్న ప్రశ్నించినట్లు తెలిసింది.  పోటాపోటీగా జెండాలు ప్రదర్శించగా జగన్‌ క్లాస్‌తో విభేదాలు లేకుండా ఇద్దరూ చెరోపక్కన ఉండి పాదయాత్ర సాగించారు.



వైసీపీలో వర్గ పోరు

No comments:

Post a Comment