Breaking News

07/07/2018

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ విద్యార్థుల ఆందోళన ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

కర్నూలు, జూలై 7 (way2newstv.in)
అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నాలుగేళ్లుగా ఒక్క డీఎస్సీని కూడా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ.. కర్నూలులో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఏబీబీపీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని రాజవిహార్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద బైఠాయించి ధర్నా చేశారు.



డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ విద్యార్థుల ఆందోళన ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ  కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

అదిగో డీఎస్సీ... ఇదిగో డీఎస్సీ .. అంటూ ఏడాది కాలంగా నిరుద్యోలు.. విద్యార్థుల జీవితాల్లో ఆశలు రేపుతూ.. నిరాశకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రకటనలను నమ్మి నిరుద్యోగులు.. విద్యార్ళులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతు ఆశగా ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం టెట్ నిర్వహించి విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేసి.. డీఎస్సీ ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ అనుమతించలేదన్న సాకు చూపి డీఎస్సీ ప్రకటనను వాయిదా వేస్తున్నట్ల ప్రభుత్వం చెప్పడం చూస్తుంటే.. నిరుద్యోలు పట్ల వారి చిత్తుశుద్ధి ఏపాటిదో తెలుస్తుందన్నారు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయకపోతే నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

No comments:

Post a Comment