Breaking News

12/07/2018

బీసీ రిజర్వేషన్లపై అఖిల పక్షం : షబ్బీర్ అలీ

హైదరాబాద్,  జూలై 12, (way2newstv.in)
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని హైకోర్టు తీర్పు చెప్పిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు.  బుధవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.  నూతన పంచాయతీ రాజ్ చట్టం సుప్రీం కోర్టు తీర్పు 50 శాతం రిజర్వేషన్ల కు వ్యతిరేకంగా  ఉంది ..ఇది చెల్లదని చెప్పింది హైకోర్టు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా టిఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు రాదని ఆయన అన్నారు. ఇంత పెద్ద సమస్యపై కోర్టులో వాదనలు జరుగుతుంటే అడ్వొకేట్ జనరల్ ఎందుకు హాజరు కాలేదని ఆయన ప్రశ్నించారు. బిసిలపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా అని ఆయన అన్నారు. 2013 లో బీసీ లకు 34 శాతం  రిజర్వేషన్లు మా ప్రభుత్వం  కల్పించింది. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండని కోర్టు ను  కోరితె గతంలో సుప్రీం కోర్టు  అవకాశం ఇచ్చింది. పంచాయతీ రాజ్ చట్టం తెచ్చినపుడు...మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసారు. దీంతో చట్టం లో ఉన్న లోపాలను చెప్పే అవకాశం మాకు లేకుండా పోయింది. సీఏం ఓట్టి మాటకారి...బీసీ లపై ఆయనకు ప్రేమలేదు. 34 శాతం రిజర్వేషన్ల నైనా బీసీ లకు కేటాయించాలి. ఈ అంశంపై చర్చించడానికి ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.



బీసీ రిజర్వేషన్లపై అఖిల పక్షం : షబ్బీర్ అలీ 

No comments:

Post a Comment