హైదరాబాద్, జూలై 12, (way2newstv.in)
విభజన చట్టంలో ప్రతి రాష్ట్రానికి జాతీయ హోదాలో ఒక నీటి ప్రాజెక్ట్ ఇవ్వాలని ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను కాళేశ్వరం ప్రాజెక్ట్ గా రిడిజైన్ చేసి జాతీయ హోదాను రాకుండా కేసీఆర్ ప్రభుత్వం చేసిందని టీటీడీపీ నేత, టిటిడి పాలకమండలి సభ్యుడు పెద్ది రెడ్డి అన్నారు. బుధవారం అయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రూ 82వేల కోట్ల అంచనాలతో రైతుల భూములను లాక్కుని ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్ట్ వల్ల రాష్ట్ర ప్రజల పై 1లక్ష కోట్ల అప్పు భారం పడనుంది. కాళేశ్వరనికి జాతీయహోదా ఎందుకు కేంద్రం ఇవ్వడం లేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. కేంద్రాన్ని కాళేశ్వరం జాతీయ హోదా పై ఎందుకు ప్రశ్నించడం లేదు. కేసీఆర్ సర్కార్ కేసుల భయంతో కేంద్రాన్ని జాతీయ హోదా పై నోరు విప్పడం లేదని అన్నారు.
కాళేశ్వరానికి జాతీయ హోదా రాలేదు : పెద్ది రెడ్డి
బయ్యారం స్టిల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఖమ్మం జిల్లా నుంచి ఏపీ లో కలిసిన మండలాలు రేపు జరిగే ఎన్నికల్లో ఓట్లు ఎవరికి వెయ్యలో ప్రభుత్వం చెప్పాలి. నిరుద్యోగులను ఉద్యోగులను చేసే కార్యక్రమాలు ప్రభుత్వం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఏపీలో విభజన చట్టాల పై పోరాటం చేస్తుంటే..కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మౌనవ్రతం చేస్తోంది. విభజన చట్టం హామీల అమలు పై గవర్నర్ ద్వారా లేఖ కేంద్రానికి పంపుతాం. ఖమ్మంతో పాటు మరో మూడు చోట్ల భారీ బహిరంగ సభలు పెడుతాం. రూ 81వేల కోట్లు మాత్రమే గత నలుగేండ్లలో కేంద్రం విడుదల చేసిందని కేసీఆర్ ప్రకటన చేశారు..మరి కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా అమలు చేయించి తెస్తారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. 13న అమిత్ షా పర్యటనలో మాట్లాడి శంకుస్థాపన కేసీఆర్ చేయించాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం పై హైకోర్టు చురకలు అంటించింది. కేసీఆర్ నిర్ణయాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో కోర్టు చురకలే ఆధారమని అయన అన్నారు.
No comments:
Post a Comment