హైదరాబాద్, జూలై 20, (way2newstv.in)
రాష్ట్రంలో 204 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 64 వేల కు పైగా విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మైనారిటీ సంక్షేమంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి దానకిషోర్, డైరెక్టర్ షాన్ వాజ్ ఖాషిం, షుకూర్, విక్టర్ తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీ సంక్షేమంపై సీఎస్ సమీక్ష
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి సర్వీస్ కమిషన్ ద్వారా 1321 మందిని నియమించామని, మరో 772 మంది టీచర్లును నియమించాల్సి ఉందని, ఇవి గాక తెలంగాణ రెసిడెన్షియల్ ఎడుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా మరో 1863 పోస్టులు భర్తీ చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఉన్న వక్ఫ్ ఆస్తుల వివరాల లిస్టును రూపొందించాలన్నారు. ఈ భూములలో విద్యా సంస్ధలు నిర్మించే విషయమై ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. మైనారిటీ యువతకు వివిధ రంగాలలో మెరుగైన శిక్షణను అందించడానికి నేషనల్ స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించాలని, తదుపరి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించటానికి చర్యలు తీసుకుంటామన్నారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 2 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించామని, షాదీ ముబారక్ పథకం ద్వారా 24662 మంది ధరఖాస్తు చేసుకోగా, 11746 మందికి మంజూరు చేశామని, మిగతావి పురోగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఓవర్ సిస్ స్కాలర్ షిప్స్ కు సంబంధించి ఇప్పటివరకు 968 మందిని ఎంపిక చేసి 109 కోట్ల రూపాయలు ఖర్చు చేసామన్నారు. మల్టి సెక్టోరల్ డెవలప్ మెంట్ కు సంబంధించి 2016-17 లో 7 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 126 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, మొదటి దశగా కేంద్రం 37.80 కోట్లు, రాష్ట్రం 25.20 కోట్లు, 2017-18 లో మరో 6 రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసిందని, కేంద్ర వాటా 10.08 కోట్లు, రాష్ట్ర వాటా 21.60 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలెప్ మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా ఐఏఎస్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మైనారిటీ విద్యార్ధులకు శిక్షణా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల మంజూరును వేగవంతం చేయాలన్నారు. అనిసుల్ గుర్బా, జామియా నిజామియా, జహంగీర్ పీర్ దర్గా, ఇస్లామిక్ కల్చర్ సెంటర్ తదితర అంశాలపై చర్చించారు.
No comments:
Post a Comment