Breaking News

27/07/2018

ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ తో ఇలియానా పెళ్లి

ముంబై, జూలై 27 (way2newstv.in) 
నాజూకు నడుము అందాలతో ఒకప్పుడు టాలీవుడ్‌‌ను షేక్ చేసిన సుందరాంగి ఇలియానా తెలుగు తెరపై కనువిందు చేసి చాలా ఏళ్లయ్యింది. అపుడెప్పుడో 2012లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో రవితేజ సరసన నటించింది. అప్పటి నుండి తెలుగు చిత్రాలవైపు చూడటం మానేసింది. ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసినా అందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి కానీ, అవకాశాలు మాత్రం రాలేదు. కొన్ని చిత్రాల్లో నటించినా అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ సమయంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అంతే కాదండోయ్ తరచూ ఈ జంట లాంగ్ ట్రిప్‌లకు వెళ్లడం, అక్కడ ప్రియుడితో ఎంజాయ్ చేసిన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ జంట ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారని.. కాదుకాదు ఎప్పుడో పెళ్లి చేసేసుకున్నారని రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో నెటిజన్‌లతో ముచ్చటించారు ఇలియానా.



ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ తో ఇలియానా పెళ్లి

 విదేశీ ప్రియుడు నీబోన్‌తో డేటింగ్‌, పెళ్లి లాంటి విషయాలపై ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది గోవా బ్యూటీ. ఓ విదేశీయుడుతో డేటింగ్ ఎందుకు చేస్తున్నారు? అతడ్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానంగా.. ‘నేను ఆ వ్యక్తి మనసుని ప్రేమించాను, ఆ వ్యక్తి రంగు ఏమిటి? ఏ దేశానికి చెందిన వాడు అన్నది నాకు అనవసరం. అది పెద్ద విషయం కాదు’ అంటూ ఒక్క ముక్కలో అతడే నా రియల్ లైఫ్ హీరో అని తేల్చేసింది ఇలియానా. ఇదిలా ఉంటే.. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ ’ చిత్రంలో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వనుంది ఇలియానా. తొలి చిత్రం ‘దేవదాసు’ సూపర్ హిట్ కావడం.. ఆ వెంటనే మహేష్ సరసన నటించిన ‘పోకిరి’ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో ఖతర్నాక్, రాఖీ, మున్నా, జల్సా, కిక్, జులాయి లాంటి వరుస చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా కోటి రూపాయల డిమాండ్ పలికిన హీరోయిన్‌గా చరిత్ర సృష్టించిందామె. ఇక తెలుగులో వరుస అవకాశాలు రావడంతో బాలీవుడ్‌పై మోజు పడింది ఈ సుందరాంగి. ఆ తరువాత బాలీవుడ్‌ ప్రయత్నించి అక్కడ బెడిసి కొట్టడంతో తిరిగి టాలీవుడ్ వైపు తిరిగిపయనమైంది. ‘ఖతర్నాక్’, ‘కిక్’, ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల్లో రవితేజతో జోడీ కట్టిన ఈ బ్యూటీ రీ ఎంట్రీలోనూ రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ (AAA)’ జోడీ కడుతుండటంతో ఆమెకు ఎంత వరకూ కలిసి వస్తుందో చూడాలి.

No comments:

Post a Comment