Breaking News

12/07/2018

పేదవాడికి ఆరోగ్యకరమైన ఆహారం

గుంటూరు, జూలై 12, (way2newstv.in)
రాష్ట్రంలో ప్రతి పేదవాడికి రుచికరమైన, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్న క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తుందని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు.నరసరావుపేట పట్టణంలో మార్కెట్ సెంటర్, డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాగణం వద్ద రెండు అన్న క్యాంటీన్స్ స్పీకర్ కోడెల ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్  మాట్లాడుతూ  రాష్ట్రవ్యాప్తంగా నేడు 25మున్సిపాలిటీలలో ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుందన్నారు. 73 లక్షల విలువైన ఆహరాన్ని ప్రభుత్వం సబ్సిడీ పై రూ.5 రూపాయలకే లకే రుచికరమైన అల్పాహారం, భోజనం అందిస్తుందన్నారు. త్వరలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరో  203 క్యాంటీన్స్ ప్రారంభిస్తుందన్నారు.  రోజూ అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం ఇలా ప్రతి క్యాంటీన్ వద్ద రోజుకి 3వందల నుండి 5వందల వరకూ ఆహరం అందించడం జరుగుతుందన్నారు. ఒక్కో వ్యక్తికి రెండు టోకెన్ల వరకు జారీకి అవకాశం  ఉందన్నారు. ప్రభుత్వం ఆహార సరఫరా బాధ్యత అక్షయపాత్ర సంస్థకు అప్పగించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇదో కీలకమైన మలుపు అన్నారు. రాష్ట్రంలో నేటి నుండి 5రూపాయకే పేదవాడికి అమృతం లాగా అందించడం జరుగుతుందన్నారు. ఇక మీద రాష్ట్రంలో పేదవాడి ఆహరం లేకుండా ఇబ్బంది పడే రోజులు ఉండవన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రతిష్ట, అక్షయపాత్ర ప్రతిషను పెరుగుతాయన్నారు. ఈ సందర్భంగా 5రూపాయలకే భోజనం అందిస్తున్న ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల, మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.



పేదవాడికి ఆరోగ్యకరమైన ఆహారం

No comments:

Post a Comment