Breaking News

26/07/2018

హోదాకోసం కాంగ్రెస్ పోరాటం

న్యూ ఢిల్లీ,జూలై 26, (way2newstv.in)
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఫైనాన్స్ కమిషన్ నివేదికలో ఎక్కడా లేదని కేవీపీ తెలిపారు. బీజేపీ ఒక అబద్దాన్ని వందసార్లు చెప్పి నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. తమ లక్షాలను సాధించేవరకు తమ పోరాటం సాగుతుందని కేవీపీ స్పష్టం చేశారు. శుక్రవారం మరోసారి రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు.  



హోదాకోసం కాంగ్రెస్ పోరాటం

ఏపి పునర్విభజన చట్టంలో పొందుపరచిన అంశాలతో సహా, రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ తీర్మానం ప్రతిపాదిస్తున్నారు  ఈ అంశంపై కేవీపీ మాట్లాడుతూ లోకసభలో నో కాన్ఫిడాన్సు , షార్ట్ డిస్కషన్ రాజ్యసభలో ముగిసింది. కాంగ్రెస్ సీడబ్ల్యూ  భేటీలో ఏమి జరిగిందో కూడా తెలుసు. స్పెషల్ స్టేటస్  ఇవ్వడానికి, పోరాడటానికి కాంగ్రెస్ సిద్ధం గా ఉంది.  లక్ష్యం సాధించేవారకు  కాంగ్రెస్ పోరాడుతుందని అయన అన్నారు. స్పెషల్ స్టేటస్  కావాలని మొదట మోడీని కొరినదే కాంగ్రెస్. మోడీకి 2014లొనే సోనియా గాంధీ లేఖ రాశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ స్టేటస్  వద్దని ఎక్కడా చెప్పలేదు.  రాబోయే అసెంబ్లి ఎన్నికల్లో , పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రలో ఇదే ఎజెండా కాబోతోంది. ప్రత్యేక హోదాపై బీజేపీ తప్ప అన్ని పార్టీలు చెప్పక తప్పలేదు. ఆంధ్రాకు ఏ నష్టం జరగకూడదు. సోనియా గాంధీ సలహమేరకు తయారుచేసిన చట్టం ని పూర్తిగా అమలు చేయాలి.  స్పెషల్ స్టేటస్ ఇచ్చేవారికే మా మద్దతు అంటూ అన్ని పార్టీస్ చెపుతున్నాయంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని అయన అన్నారు. ఒకప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అపహాస్యం చేశారు... ఇప్పుడు అదే అందరి ఉద్యమంగా మారింది.  ఇది నిరంతరం కొనసాగాల్సిన ఉద్యమం . వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచిన హామీలు... దేవున్ని, ప్రజలను మోసం చెయ్యడానికి మోడీ మాట్లాడారా అని అయన ప్రశ్నించారు.

No comments:

Post a Comment