Breaking News

28/07/2018

అమరవీరుల వారోత్సవాలు ప్రారంభం

హైదరాబాద్,  జూలై  28, (way2newstv.in) 
శనివారం  నుండి ఆగస్ట్ 3 వరకు..మావోయిస్టులు వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.  దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్టీకి విస్తృత సేవలు అందించి అమరులైన మావోయిస్టుల నేతలను స్మరించుకునేందుకు నిర్వహిస్తున్న వారోత్సవాల సందర్భంగా జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో కాటారం, మహదేవపురం, పరమళ, మహా ముత్తారం, మల్ హర్ మండలాలలోని అటవీ ప్రాంతాలలో పోలీసులు భారీగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో  టార్గెట్లను హెచ్చరిస్తూ మావోయిస్టుల పోస్టర్లు, బ్యానర్లు వెలిసాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మిస్తున్న మేడిగడ్డ ప్రాజెక్టు,కన్నెపల్లి పంప్ హౌజ్ ల వద్ద పోలీసులు భారీ భద్రతను పెంచారు. అటు, ఏఒబి లో కుడా వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే మారుమూల గ్రామాల్లో  బ్యానర్లు పోస్టర్లు కనిపించాయి. తాజాగా శనివారం నాడు  కొయ్యురు చక్కగొయ్యి వద్ద ఇన్ఫార్మర్ నెపంతో జైరాం అనే వ్యక్తిని మావోయిస్టులు  హతమార్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరిలో కుడా మావోయిస్టు పోస్టర్ల కలకలం రేసాయి.  మావోయిస్టుల పోస్టర్లు ప్రత్యక్షమవడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. .. అమరవీరుల వారోత్సవాలు ప్రారంభం

No comments:

Post a Comment